Begin typing your search above and press return to search.

'పవర్ స్టార్' పిల్లలతో టాలెంటెడ్ హీరో..!

By:  Tupaki Desk   |   12 April 2021 8:30 AM GMT
పవర్ స్టార్ పిల్లలతో టాలెంటెడ్ హీరో..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్ - ఆద్యలతో టాలెంటెడ్ యువ హీరో అడవి శేష్ చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం తెలిసిందే. ‘ఎవరు’ చిత్రం చూసినప్పటి నుండీ అకీరాకి అడవి శేష్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడని.. శేష్ ని 'అన్న' అని పిలుస్తాడని.. శేష్ ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అని రేణూ దేశాయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడు రేణు దేశాయ్ ఇంటికి వెళ్లి అకీరా' ఆద్యాలతో సరదాగా సమయం గడిపి వస్తుంటాడు శేష్. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల అకీరా - ఆద్యాలను అడవి శేష్ కలిసినట్లు తెలుస్తోంది.

అడవి శేష్ పవర్ స్టార్ పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అకీరా - శేష్ మాస్కులు ధరించి ఉన్నారు. ఆద్యా మెడను శేష్ పట్టుకుంటే ఊపిరాడనట్లు ఆమె ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. ఏదేమైనా శేష్ కారణంగా తమ అభిమాన హీరో పిల్లలను చూసే అవకాశం వస్తుండటంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే శేష్ ప్రస్తుతం 'మేజర్' అనే త్రిభాషా చిత్రంలో నటిస్తున్నారు. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూపర్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇక అకీరా విషయానికొస్తే పవన్ లానే చూడ చక్కని రూపంతో 6.4 అడుగుల ఎత్తుతో స్పెషల్ గా కనిపిస్తాడు. తెలుగులో అకీరా డెబ్యూ కోసం పవన్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.