Begin typing your search above and press return to search.
మళ్లీ అడవి శేష్ కు కమర్షియల్ గండం తప్పదా..!
By: Tupaki Desk | 24 Jun 2022 2:30 AM GMTసినిమా ను ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా.. ఎంతగా ప్రమోట్ చేసినా.. అద్బుతంగా తీర్చి దిద్దినా కూడా విడుదల తేదీ విషయంలో జాగ్రత్త పడకుంటే.. ప్లాన్ లేకుండా విడుదల చేస్తే ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పెద్ద నిర్మాతలు ఎక్కువ శాతం తమ సినిమా లను ఆలస్యం అయినా పర్వాలేదు కాని సోలో రిలీజ్ కు వెళ్లాలి అనుకుంటారు. లేదంటే పండుగ సీజన్ చూసుకుంటారు.
తాజాగా విడుదల అయిన అడవి శేష్ మేజర్ సినిమా ఆ విషయంలో విఫలం అయ్యిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ విక్రమ్ తో పాటే మేజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో ఏడు నుండి తొమ్మిది కోట్ల వరకు మేజర్ నష్టపోవాల్సి వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
మేజర్ సినిమా కమర్షియల్ మూవీ అవ్వడంతో పాటు చాలా కాలం తర్వాత యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కు మంచి సక్సెస్ పడింది. ఇక మేజర్ సినిమా విషయానికి వస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అది ఒక కమర్షియల్ సినిమా కాదని మొదటి నుండి అంతా ఒక అభిప్రాయంకు వచ్చారు. బయోపిక్.. అది కూడా మేజర్ సందీప్ కథ అవ్వడం వల్ల ఆయనపై గౌరవం ఉంది కాని కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారు పెద్దగా ఆ సినిమా వైపు ఆసక్తి చూపలేదు అనే టాక్ వినిపించింది.
అడవి శేష్ యొక్క నటన మరియు సినిమాకు వచ్చిన టాక్ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ వల్ల కాస్త నష్టపోయిన మేజర్ తమిళనాడు లో ఎక్కువగానే నష్టపోవాల్సి వచ్చింది. అక్కడ ఊహించిన దానికంటే చాలా తక్కువ వసూళ్లు అక్కడ నమోదు అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
విక్రమ్ సినిమా దాదాపు రెండు వారాల పాటు తమిళనాడు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇంకా కూడా మంచి వసూళ్లే అక్కడ వస్తున్నాయి. కనుక మేజర్ సినిమా అక్కడ కమర్షియల్ గా నిరాశ పర్చింది. అడవి శేష్ తదుపరి సినిమా 'హిట్ 2' కు కూడా అదే పరిస్థితి తప్పదేమో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హిట్ 2 ను జూలై 29న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
అదే తారీకున రవితేజ నటించిన పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. దాంతో ఈ రెండు సినిమాల మధ్య కచ్చితంగా క్లాష్ ఉంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ సినిమా తరహా లోనే హిట్ 2 కూడా ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ గొప్పగా ఆశించడానికి లేదు.
కమర్షియల్ సినిమా కానప్పుడు ఖచ్చితంగా ఒక కమర్షియల్ సినిమా వస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ విషయంలో అడవి శేష్ మళ్లీ హిట్ 2 తో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటి నుండే టాక్ వినిపిస్తుంది. హిట్ 2 విడుదల తేదీ మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనే టాక్ వినిపిస్తుంది. మరో కమర్షియల్ గండం తప్పాలంటే హిట్ 2 విడుదల తేదీ మార్చితే ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.