Begin typing your search above and press return to search.
చెప్పిందే చెబుతున్నాడు.. ఏమవుద్దో
By: Tupaki Desk | 22 Feb 2016 5:30 PM GMTఅడివి శేష్. తన డెబ్యూ సినిమా 'కర్మ' కంటే కూడా.. పంజా సినిమాలో విలన్ గానే బాగా పాపులర్ అయ్యాడు. అదీ పవన్ కళ్యాన్ సినిమా అంటే.. ఫ్లాప్ మూవీ అయినా కూడా మనోడికి పేరొచ్చేసింది. ఇప్పుడిక ''క్షణం'' సినిమాతో అందరినీ ఆశ్చర్యపరచడానికి వచ్చేస్తున్నాడు శేష్. ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కాదులేండి.. మనోడే హీరో.
అయితే ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువగా శేష్ రెండు విషయాలు చెబుతున్నాడు. ఒకటి.. అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ తనపై ధ్వజమెత్తడం గురించి. రెండోది ఈ క్షణం సినిమా కథ ఎలా పుట్టిందనే విషయం గురించి. బాహుబలి ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాన్ గురించి మాట్టాడటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలయ్యి.. ఇతగాడి ఫేస్ బుక్ పేజీలో బూతులు తిట్టడం మొదలెట్టారు. కాని శేష్ మాట్టాడిన దాంట్లో తప్పేలేదు. అయినాసరే మనోడు అపాలజీ చెప్పాడు కాబట్టి.. ఆ విషయం సెటిలైందిలే. కాకపోతే ఇప్పటికీ అది తలుచుకుని ఫీలవుతున్నాడట కుర్రాడు. ఉత్తి పుణ్యానికి నన్ను తిట్టారని చెబుతున్నాడు.
ఇకపోతే ఈ ''క్షణం'' కథ విషయానికొస్తే.. జూబ్లీ హిల్స్ లో ఒక చిన్న పిల్ల మనోడిని కారు లిఫ్టు అడగటం.. ఆ పిల్లకు లిఫ్ట్ ఇచ్చాక.. అసలు ఎవరన్నాఆమెను కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి అనే ఆలోచనం రావడం.. అందులోంచి ఈ కథ పుట్టడం.. అబ్బో చాలా కథే ఉంది. మరి అడివి శేష్ ఇవన్నీ చాలాసార్లు చెప్పిన విషయాలే. ఇలా చెప్పినవే చెప్పి.. ఎంతవరకు ''క్షణం''కు ఓపెనింగ్స్ తెప్పిస్తాడో చూడాలి.