Begin typing your search above and press return to search.

ప్లే బ్యాక్‌ చూస్తే 'అద్బుతం' అనిపించదు

By:  Tupaki Desk   |   20 Nov 2021 4:43 AM GMT
ప్లే బ్యాక్‌ చూస్తే అద్బుతం అనిపించదు
X
యంగ్ ఫిల్మ్‌ మేకర్స్ పై హాలీవుడ్‌ సినిమాల ప్రభావం చాలా ఉంటుంది. ఒకప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రమే హాలీవుడ్‌ సినిమాలను చూసి కాపీ కొట్టేవాడు అనే టాక్ ఉంది. కాని ఇప్పుడు ఎంతో మంది యంగ్ ఫిల్మ్‌ మేకర్స్ హాలీవుడ్‌ సినిమాలను కొరియన్‌ మూవీస్ తో పాటు ఇతర విదేశీ సినిమాలను చూసి ఇన్సిపైర్‌ అవుతున్నారు. కొందరు ఆ కథలను మార్చి రాసుకుని ఇక్కడ సినిమాలను తీస్తుంటే మరి కొందరు మాత్రం కథలను ఉన్నది ఉన్నట్లుగా తెలుగు నేటివిటీకి మార్చి తీస్తున్నారు. తాజాగా వచ్చిన అద్బుతం సినిమా కూడా ఒక సినిమాకు కాపీగా టాక్ వినిపిస్తుంది. కొరియన్ మూవీ కాల్‌ కు మాత్రమే కాకుండా ఇప్పటికే తెలుగు లో వచ్చిన ప్లే బ్యాక్‌ సినిమాకు కూడా కాస్త దగ్గరగా ఉంది.

ముఖ్యంగా కాల్ సినిమాతో పోల్చితే ఈ సినిమా చాలా దగ్గరగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. వేరు వేరు కాలాల్లో ఉన్న వారు ఒక ఫోన్ ద్వారా కనెక్ట్‌ అయితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కాల్‌ మరియు ప్లే బ్యాక్ సినిమాల్లో చూపించడం జరిగింది. కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇచ్చి విభిన్నమైన ఎంటర్ టైన్మెంట్‌ తో తాజాగా అద్బుతంను తెరకెక్కించారు. ఈ సినిమా కు మిశ్రమ స్పందిన వస్తుంది. కాల్ మరియు ప్లే బ్యాక్ సినిమాల గురించి తెలియని వారికి వేరు వేరు కాలాల్లో ఉన్న వారు ఒక ఫోన్ తో కనెక్ట్‌ అవ్వడం వంటి అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి. కాని ప్లే బ్యాక్ చూస్తే మాత్రం అద్బుతం ఒక అద్బుతం అన్నట్లుగా అనిపించక పోవచ్చు.. సర్ ప్రైజ్ అవ్వక పోవచ్చు అంటూ మూవీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమాను ఆయన కొరియన్‌ మూవీ కాల్ కథ నుండి ప్రేరణ పొంది రాసినట్లుగా చెబుతున్నారు. కాని సినిమా చాలా కథ కాల్ నుండి తీసుకున్నారు. ఇక ఈ సినిమా లో తేజ సజ్జ మరియు శివాని రాజశేఖర్‌ లు నటించారు. ఇద్దరి మద్య సాగే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సినిమా ను థియేటర్ రిలీజ్ అనుకున్నా కూడా కరోనా కారణంగా థియేటర్లు చాలా కాలం మూత పడ్డాయి. ఇప్పుడు ఓపెన్‌ అయిన వెంటనే పెద్ద ఎత్తున ఇతర సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. కనుక హాట్‌ స్టార్‌ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేశారు. ప్రేక్షకులు ఇప్పటికే అద్బుతంను ఆస్వాదించేస్తున్నారు. మీరు కనుక ప్లే బ్యాక్‌ చూడనట్లయితే వెంటనే ఈ అద్బుతంను చూడవచ్చు.. ఒక వేళ ప్లే బ్యాక్‌ చూసినా అద్బుతంను ఓపెన్ మైండ్‌ తో ఒక సారి స్ట్రీమింగ్ చేయవచ్చు అంటూ సోషల్ మీడియాలో సినిమాను చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.