Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఫాంటసీ లవ్ స్టోరీగా తేజ సజ్జా 'అద్భుతం'
By: Tupaki Desk | 9 Nov 2021 3:16 PM GMT'జాంబీరెడ్డి' సినిమాతో హీరోగా పరిచయమైన తేజ సజ్జా.. వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇటీవలే 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టొరీ' తో పలకరించారు. ప్రస్తుతం 'హను-మాన్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న తేజ.. ''అద్భుతం'' అనే చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్19న డైరెక్ట్ ఓటీటీ విధానంలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'అద్భుతం' ట్రైలర్ చూస్తుంటే ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఫాంటసీ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తేజ సజ్జా - శివాని వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తుండగా.. వారిద్దరూ ఒకే ఫోన్ నెంబర్ ను కలిగి ఉన్నారు. ఒకరి కాల్స్ ఒకరికి రావడం.. ఒకానొక సందర్భంలో ఇద్దరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోవడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాల నవ్వు తెప్పిస్తున్నాయి. వారిద్దరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది.. అసలు ఒకరికొకరు కలుసుకున్నారా లేదా? అనేది తెలుసుకోవాలంటే 'అద్భుతం' సినిమా చూడాల్సిందే.
ఇందులో తేజ - శివాని జంట ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తోంది. తులసి - శివాజీ రాజా - సత్య - హర్ష - మిర్చి కిరణ్ - దేవీ ప్రసాద్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 'అద్భుతం' చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించగా.. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే - మాటలు సమకూర్చారు. రథన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిజినల్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. చంద్ర శేఖర్ మొగుల్ల - సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరించారు. డిఫరెంట్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.