Begin typing your search above and press return to search.
'బంగార్రాజు'కు మరింత గ్లామర్‌ని యాడ్ చేశారు
By: Tupaki Desk | 9 Jan 2022 3:30 AM GMTకింగ్ నాగార్జున నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `సోగ్గాడే చిన్ని నాయన`. 2016లో వచ్చిన ఈ మూవీ నాగ్ కెరీర్‌లోనూ అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో చాల ఆకాలంగా ఈ మూవీకి ప్రీక్వెల్ ని చేయాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అది ఇప్పటికి కుదిరింది. అయితే `సోగ్గాడే చిన్ని నాయన`లో ద్విపాత్రాభినయం చేసిన నాగ్ ఈ మూవీకి ప్రీక్వెల్ గా రూపొందుతున్న `బంగార్రాజు` లో చిన్న బంగార్రాజుగా నాగచైతన్యని నటింపజేశారు.
దీంతో ఈ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. `సోగ్గాడే చిన్ని నాయనా` తనని దాదాపు వంద కోట్ల క్లబ్ లో చేర్చడంతో సెంటిమెంట్ గా భావించిన నాగార్జున `బంగార్రాజు`ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గరి నుంచి ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అంశం గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. ముందు ఈ మూవీని జనవరి 15న సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేశారు.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సంక్రాంతి రేస్ నుంచి పాన్ ఇండియా మూవీస్ `ఆర్ ఆర్ ఆర్`, ప్రభాస్ `రాధేశ్యామ్` తప్పుకోవడంతో `బంగార్రాజు` సంక్రాంతి కానుకగా జనవరి 14న వచ్చేస్తోందంటూ ప్రకటించేశారు. దీంతో సంక్రాంతి బరిలో `బంగర్రాజు`దే హవా వుండబోతోంది. అంతే కాకుండా సినిమాపై ఇప్పడికే భారీ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్‌ని మరింత పెంచబోతున్నారు.
ఇందు కోసం ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్ లని రంగంలోకి దించేశారు. ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ చెప్పేశాడు. ఇద్దలో హీరోయిన్ లుగా రమ్యకృష్ణ, కృతిశెట్టి నటిస్తున్నారు. వీరు కాకుండా మరో ఆరుగురు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్‌కర్ తో పాటు అతిథి పాత్రలో సీరత్ కపూర్ కనిపించబోతోంది. దీంతో `బంగార్రాజు` ఫుల్ గ్లామర్ కలరింగ్ తో ఓ రేంజ్‌లో ప్రేక్షకులకి ఫుల్ నయనానందకరమైన స్టఫ్ గ్యారెంటీ అంటున్నారు.
ఇక ఇందులో ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్ లని దించేశారేంటని అడిగితే మాత్రం మేము ప్లాన్ చేసి తీసుకోలేదని స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టే అంత మంది హీరోయిన్ లని తీసుకోవాల్సి వచ్చిందని దర్శకుడు కల్యాణ్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా మరో ఆసక్తికరమైన విషయాన్ని, సినిమాపై వున్న నమ్మకాన్నిఈ సందర్భంగా స్పష్టం చేశాడు.
`బంగార్రాజు` ఫలింతపై గట్టి నమ్మకంతో వున్నామని, ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సంక్రాంతి రేసులో వున్నప్పటికి మేము ఖచ్చితంగా బరిలోకి దిగేవాళ్లం. మా నమ్మకం ప్రకారం ఈ సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు ట్రీట్ అవుతుందని, సినిమాలో వున్న ఐదు యాక్షన్ సీక్వెన్స్ లు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని వివరించారు కల్యాణ్ కృష్ణ. దర్శకుడి కాన్పిడెంట్ కి తగ్గట్టే `బంగార్రాజు` ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ని రఫ్ఫాడించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీని జీ స్టూడియోస్ తో కలిసి కింగ్ నాగార్జున నిర్మించారు.