Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ మీద అదనపు ఒత్తిడి
By: Tupaki Desk | 5 March 2019 4:57 AM GMTఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనేది పాత సమేత. ఎవరో ట్వీటులు వేశారు ఇంకెవరో దానికి ఎఫెక్ట్ అయ్యారు అనేది కొత్త నానుడి. అది ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అచ్చంగా సరిపోతుంది. నిన్న సాయంత్రం మహేష్ బాబు స్వయంగా సుకుమార్ తో సినిమా చేయడం లేదని ప్రకటించడం చిన్నపాటి తుఫాను రేపింది. మహర్షి అవ్వగానే రేపో ఎల్లుండో అది స్టార్ట్ అవుతుందని అభిమానులు ఎదురుచూస్తుండగానే ఇలాంటి ట్విస్ట్ రావడం ఎవరూ ఊహించనిది.
అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి ఇక ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రకటించడమైతే చేశారు కాని సుక్కు దగ్గర బన్నీ కోసం రెడీ స్క్రిప్ట్ అయితే లేదని టాక్. కేవలం లైన్ మాత్రమే ఓకే చేయించుకున్నాడని గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబటి ఇంకో మూడు నాలుగు నెలల్లో ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో కలుద్దామని చెప్పుకున్నట్టు టాక్
ఇదంతా బాగానే ఉంది కాని అల్లు అర్జున్ ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలుపెట్టనే లేదు. అదుగో ఇదుగో అంటున్నారు తప్ప అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. సుకుమార్ జూన్ లేదా జూలై అనుకున్నా అప్పటికి త్రివిక్రమ్ సినిమా పాతిక శాతం కూడా పూర్తయ్యి ఉండదు. ఒకవేళ ఓ ఆరు నెలల్లో పూర్తి చేస్తారు అనుకుంటే అప్పటిదాకా సుకుమార్ ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు. కాని ఇది త్రివిక్రమ్ మీద ఒత్తిడి రూపంలో పని చేస్తుంది.
సుకుమార్ వెయిట్ చేస్తున్నాడు కాబట్టి వీలైనంత త్వరగా బన్నీ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. మార్పులకు ఛాన్స్ ఉండదు. ఇది కాకుండా ఏడాది గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉండాలన్న ప్రెజర్ అదనంగా ఉంటుంది. సో ఇలా రెండు వైపులా ఊహించని రీతిలో త్రివిక్రమ్ మీద బరువైతే ఉంటుంది. కాని కథ విషయంలో మార్పుల గురించి బన్నీ అల్లు అరవింద్ లకు నచ్చేలా త్రివిక్రమ్ మార్పులు చేయలేకపోతున్నారని మరో టాక్ ఉంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో