Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ 'అధీరా' బ్రూటల్ లుక్.. అందులో నుండే స్ఫూర్తి పొందారట!!

By:  Tupaki Desk   |   5 Aug 2020 2:30 AM GMT
కేజీఎఫ్ అధీరా బ్రూటల్ లుక్.. అందులో నుండే స్ఫూర్తి పొందారట!!
X
బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ చాప్టర్-1 సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్-2 మూవీ రానున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా దేశవాప్తంగా సినీ అభిమానులు కేజీఎఫ్-2 కోసం.. హీరో కేజీఎఫ్ డాన్ ఎలా అయ్యాడో చూడాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ రిలీజ్ చేసే ప్ర‌ణాళిక‌లు ఇప్పట్లో ఏమి లేవ‌ని, సినిమా రిలీజ్‌ ముందే ట్రైలర్ విడుదల అవుతుందని నిర్మాతలు తేల్చి చెప్పేసారు. అయితే జులై 29న సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా అధీరా 'బృటాలిటీ' లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అధీరా లుక్ చూసినప్పటి నుండి కేజీఎఫ్ అభిమానులలో హుషారు మాములుగా లేదు. ఆ హెయిర్ స్టైల్, ఆ క్రూరత్వం అంతా ఫస్ట్ లుక్ లోనే పరిచయం చేశారు. పోస్టర్ లోనే ఇలా ఉంటే సినిమాలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే సంజయ్ దత్ క్రూయల్ లుక్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ కొన్ని నిజాలు బయట పెట్టాడు. "అధీరా లుక్ చూసినప్పుడే అందరికి వణుకు పుట్టాలనేది మెయిన్ కాన్సెప్ట్. అందుకే అంత క్రూరంగా ఉంది. ఇక ఈ లుక్ ను.. 2013లో వైకింగ్స్ అనే హిస్టారికల్ డ్రామా సిరీస్ నుండి స్ఫూర్తి పొందినట్లు" తెలిపాడు. వైకింగ్స్ లోని రాజ్ఞర్ అనే పాత్ర నుండి స్ఫూర్తి పొంది లుక్ డిజైన్ చేశారట. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్-2 చిత్రం కన్నడతో సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.