Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: పిల్లలకోసం ఈ బంటీ

By:  Tupaki Desk   |   12 Sep 2018 8:06 AM GMT
ట్రైలర్ టాక్: పిల్లలకోసం ఈ బంటీ
X
తెలుగులో కొత్తదనం లేదు అని మొత్తుకునేవాళ్ళకు మొట్టికాయలు వేస్తున్నంత రేంజ్ లో ప్రయోగాలు చేస్తున్నారు మన ఫిలిం మేకర్స్. ఇక ప్రయోగాలకు... వింత వింత కాన్సెప్ట్ లకు పెట్టింది పెరైన నటుడు కమ్ డైరెక్టర్ రవిబాబు తాజాగా పంది పిల్ల ప్రధాన పాత్రలో 'అదుగో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

జంతువులు మాట్లాడడం.. ప్రధాన పాత్రలలో ఉండే సినిమాలు హాలీవుడ్ లో తరచుగా వస్తుంటాయి. ఇది కూడా అదే స్టైల్ లో ఉన్న సినిమా అని ట్రైలర్ లో చూస్తే తెలుస్తుంది. ఇండియా లోనే ఫస్ట్ లైవ్ యాక్షన్ 3D టెక్నాలజీతో తెరకెక్కించిన సినిమా అని మేకర్స్ చెప్తున్నారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ వల్లే పోస్ట్ ప్రొడక్షన్ రెండేళ్ళు తీసుకుందట. లవ్ - ఎమోషన్స్ - కామెడీ ఫైట్స్ అన్నీ ఎలిమెంట్స్ చూపించారు గానీ ఎందుకో అవి కనెక్ట్ అయ్యేలా లేవు. ఆ షాట్స్ లో ఉండే ఎమోషన్స్ కంటే సిల్లీగా ఉంది కదా అని ప్రేక్షకులు ఫీలయ్యేలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ లో స్టాండర్డ్ లేకపోవడంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు.

ఇలాంటి సినిమాలకు విజువల్స్ క్వాలిటీ చాలా కీలకం... అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ అయినప్పుడు ఆ పందిని మనకు రియల్ గా ఉన్నట్టు చూపించాలి కానీ అది క్లియర్ గా మిస్ అయింది. ఇక ఈ సినిమా చిన్నపిల్లలకు కనెక్ట్ అవుతుందేమో చూడాలి. అసలే లిప్పులాకులకు జిమ్నాస్టిక్ కిస్సులకు అలవాటుపడి ఉన్న యూత్ ని ఈమాత్రం ఎగ్జైట్ చేస్తుందనేది సందేహమే. ఇక మొత్తం ట్రైలర్ లో ఒకే ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ వాయిస్ లో చెప్పిన "ఒరేయ్ పందీ.. మనిషిలా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పించుకుంటావురా??

ట్రైలర్ ఈ సెంటెన్స్ కిందే ఉంది.. ఒక లుక్కేసి తరించండి.