Begin typing your search above and press return to search.
అందరి పక్కనా చేయలేనంటున్న ఆది
By: Tupaki Desk | 19 July 2016 4:18 AM GMTఅప్పట్లో.. నేను ఫోన్ చేసి చేస్తావా నానా అంటే.. ఓకె అంకుల్ అన్నాడు.. అని అల్లు అరవింద్ చెబితే.. ఆయన హీరో ఆది గురించి కాస్త ఎగ్జాజరేటెడ్ గా చెబుతున్నారేమో అంటూ అందరూ అనుకున్నారు. కాని అందులో నిజముందని ఇప్పుడు అర్ధమవుతోంది. ''సరైనోడు'' సినిమాలో విలన్ గా హీరో ఆది చాలా బాగా చేశాడని వేరే చెప్పక్కర్లేదు. హీరోగా తెలుగులో ఓ మూడు సార్లు ప్రయత్నించినా కూడా ఫలితం రాకపోవడంతో.. ఇలా విలన్ రోల్స్ మీద కన్నేశాడని అనుకున్నారు. కాని అక్కడే ట్విస్టుంది.
ఈ మధ్యన ఓ ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోలు.. తమ సినిమాల్లో యాంటీ-హీరోగా నటించమని ఆది ని ఎప్రోచ్ అయ్యారట. అయితే వాళ్లందరికీ కనీసం కథ ఏంటి.. స్టోరీ ఏంటి అని కూడా వినకుండానే 'నో' అని చెప్పేశాడట ఈ యంగ్ హీరో. ఎందుకు రాజా అంటే.. ''అసలు పెద్ద పెద్ద హీరోల పక్కన తప్పిస్తే చిన్న హీరోల పక్కన వేయలేను.. వేయను కూడా..'' అని తెల్చి చెప్పేశాడట. అప్పట్లో అల్లు అరవింద్ స్వయంగా ఫోన్ చేసి చెప్పడం వలనే.. బన్నీ పక్కన విలనుగా చేశానని కూడా సెలవిచ్చాడట.
సర్లేండి ఎవరి క్లారిటీ వారిది. ఇంకా వయస్సులోనే ఉన్న కుర్రాడు కాబట్టి.. హీరోగా ప్రయత్నించుకుంటే ఓ ఐదేళ్లకైనా సక్సెస్ కొట్టి ఛాన్సుంది కాబట్టి.. ప్రతీ చిన్న హీరో ప్రక్కనా విలన్ గా చేసేస్తే.. ఉన్న కాస్త క్రేజ్ కూడా పోతుంది.