Begin typing your search above and press return to search.
#ఆదిపురుష్ 3డి .. కరోనా కష్టంలో 50రోజుల వేడుక
By: Tupaki Desk | 20 July 2021 11:30 AM GMT50రోజులు 100 రోజులు 175 రోజులు అంటూ ఒకప్పుడు మాట్లాడుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో 50 రోజులు అన్న మాటే లేదు. సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి. అన్నిరోజులు సినిమా ఆడించాల్సిన పని లేదు. రిలీజైన తొలి వీకెండ్ తొలి వారం రెండో వారం వరకూ ఆడితే చాలు. ఆ తర్వాత ఆడినా థియేటర్ల నుంచి తీసేస్తున్నారు. అదంతా సరే కానీ.. ఇంకా రిలీజ్ కాని సినిమాకి 50 రోజుల వేడుక అంటే విడ్డూరంగా లేదూ? కానీ ఇది నిజం.
ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియ చిత్రం ఆదిపురుష్ 3డి 50రోజుల వేడుక జరుపుకుంది. దీనర్థం 50రోజుల షూటింగ్ దిగ్విజయం గా పూర్తయిందని. నిజానికి ఈ కరోనా కష్ట కాలంలో అన్ని కాల్షీట్లను సద్వినియోగం చేస్తూ షూటింగ్ చేయడం అంటూ ఆషామాషీ కాదు. స్టార్లను సెట్స్ కి రప్పించి షూటింగ్ చేయడం గొప్ప ప్రహసనం. అందుకే ఈ వేడుక జరిపారని భావించవచ్చు.
50రోజుల వేడుక అంటూ ఫ్లెక్సీ కూడా అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ట్రెండ్స్ ట్విట్టర్ లో ఇప్పటికే ఇవి దర్శనమిస్తున్నాయి. ఆదిపురుష్ చిత్రం రామాయణం ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో కృతి సనన్ సీతగా నటిస్తుండగా ప్రభాస్ శ్రీరాముడిగా ..సైఫ్ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీసింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.
అజేయుడిగా దూసుకెళుతున్న ప్రభాస్:
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతి ప్రాజెక్ట్ ని అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్ తో `రాథేశ్యామ్` తెరకెక్కగా.. మరో 150 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ `సలార్` చిత్రీకరణ సాగుతోంది. 300 కోట్ల వ్యయంతో `ఆదిపురుష్ 3డి` తెరకెక్కుతోంది. వీటన్నిటిపైనా భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాల్ని అమాంతం పెంచాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు ఆన్ సెట్స్ లోనే ఉన్నాయి. రాధేశ్యామ్ కొద్దిపాటి పెండింగ్ చిత్రీకరణలు పూర్తి చేసి తదుపరి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. సలార్- ఆదిపురుష్ ప్రస్తుతం చిత్రీకరణల దశలో ఉన్నాయి. అలాగే `మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధేశ్యామ్ ని రిలీజ్ చేయడంతో పాటు మిగతా మూడు సినిమాలకు ప్రభాస్ మూడేళ్ల పాటు సమయం వెచ్చిస్తున్నాడు. అసాధారణ బడ్జెట్ ని వీటన్నిటి కోసం ఖర్చు చేయనున్నారు. ప్రతి సినిమా ఆరు నెలల గ్యాప్ తో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండడం అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది.
రాధేశ్యామ్ రిలీజ్ తేదీ ప్రకటించనున్నారని తెలుస్తోంది. `సలార్` వచ్చే ఏడాది ఏప్రిల్ లో.. `ఆదిపురుష్` ని అదే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.