Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: సెంచరీ కొట్టిన `ఆదిపురుష్`
By: Tupaki Desk | 3 Nov 2021 9:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెలుగు..హిందీలో ఓంరౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్ -3డి` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా...కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్ నటిస్తున్నారు. ఇక `రామాయాణం`లో మరో అత్యంత కీలక పాత్ర అయిన రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖ్ నటిస్తున్నారు. టీ సిరీస్-రెట్రోఫలైస్ 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇలా `ఆదిపురుష్` భారీ కాన్సాప్ పై తెరకెక్కుతోంది. చాలా భాగం షూటింగ్ ఇండియాలోనే వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఎక్కువగా ముంబై..హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా సెట్లు వేసి తెరకెక్కించారు.
ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తియింది. దాదాపు షూట్ క్లైమాక్స్ కి చేరుకుంది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా 100 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకుంది. చిత్రీకరణ మొదలై ఇప్పటివరకూ 100 రోజుల పాటు షూటింగ్ జరిపారు. ఇంకా కొన్ని వారాల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని యూనిట్ తెలిపింది. వాస్తవానికి అక్టోబర్ నెలాఖరుకు చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని మీడియా కథనాలు వేడెక్కించాయి. కానీ మధ్యలో బ్రేక్ రావడంతో డిలే అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృతి సనన్.. సైఫ్ అలీఖాన్ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తిచేసారు.
ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గత వారం నుంచి ప్రభాస్ రెగ్యులర్ గా సెట్స్ కు హాజరవుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం సెట్లు నిర్మించారు. సెట్ల నిర్మాణానికే భారీ ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు షూటింగ్ పూర్తయిన భాగానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంట వెంటనే చేస్తున్నారు. కొన్ని వారాల్లోనే మొత్తం చిత్రీకరణ పూర్తి చేసి వీఎఫ్ ఎక్స్ సహా ఇతర పనుల్ని వేగంగా పూర్తి చేయనున్నారు. ఇక చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 22న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు.