Begin typing your search above and press return to search.
ఆదిపురుష్: ఆ నాటు భాషను తొలగించారు
By: Tupaki Desk | 21 Jun 2023 9:49 PM GMTపురాణేతిహాసం ఆధారంగా సినిమా తీసినప్పుడు సంభాషణల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో బాలీవుడ్ రచయితలలో ఒకరైన మనోజ్ ముంతాషిర్ ప్రత్యక్షంగా ఫేస్ చేసారు. ప్రజల నుంచి దాడుల్ని నెటిజనుల నుంచి దారుణమైన ట్రోలింగుని ఎదుర్కొన్నారు.
ఇంతలోనే ప్రజాభీష్ఠం మేరకు నాటు డైలాగులను మార్చేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సెంటిమెంట్ ను గౌరవించేలా భాషను మారుస్తున్నామని రచయిత సహా నిర్మాతలు అన్నారు.
ఇంతకీ ఇందులో ఎబ్బెట్టుగా ఉన్న ఆ డైలాగ్ ఏదీ? అంటే.. బజరంగ్ తోకకు నిప్పు పెట్టినప్పుడు, ఇంద్రజిత్ అతనిని 'కాలుతుందా?' అని అడుగుతాడు. దానికి బజరంగ్ ఇలా ప్రతిస్పందించాడు. ''గుడ్డ (బట్ట) నీ బాబుది.. మంటా నీ బాబుది.. నూనే నీ బాబుది... కాలేది కూడా నీ బాబుదే..! అనే డైలాగ్ చెబుతాడు. ఇది పక్కా ఊర మాస్. నాటి కాలమానం ఇతిహాస ఔన్నత్యానికి తగ్గట్టు ఈ భాష సూట్ కాలేదు. ఇప్పుడు ఈ డైలాగ్ మారింది.
''మంట నీ లంకది.. నూనే నీ లంకది.. కాలేది కూడా నీ లంకే'' అంటూ డైలాగ్స్ మార్చారు మేకర్స్. మారిన డైలాగ్ వీడియో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఆదరణ పొందుతున్న ఆదిపురుష్ తప్పిదాలను సవరిస్తున్నామని నిర్మాతలు ఇంతకుముందు ప్రకటించారు. ఈ చిత్రం డైలాగ్ లలో మార్పులు చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ప్రజలయ సూచన మేరకు ఈ ప్రయత్నం అని తెలిపారు. సినిమా ప్రధాన సారాంశంతో ప్రతిధ్వనించేలా డైలాగుల్లో మార్పులు చేస్తున్నారు. కొన్ని రోజుల్లో థియేటర్లలో ఇది ప్రతిబింబిస్తుంది. ఈ నిర్ణయం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్లు ఉన్నప్పటికీ బృందం కట్టుబడి ఉంది. మేకర్స్ ప్రేక్షకుల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తున్నామని తెలిపరు.
నా డైలాగ్ లకు అనుకూలంగా నేను లెక్కలేనన్ని వాదనలు చేయగలను! అని వ్యాఖ్యానించిన రచయిత ముంతాషిర్.. కానీ ఇది మీ బాధను తగ్గించదని ప్రజలనుద్ధేశించి అన్నారు. నేను నిర్మాత-దర్శకుడు మిమ్మల్ని బాధించే కొన్ని డైలాగ్ లను సవరించాలని నిర్ణయించుకున్నాము. వాటిని ఈ వారం చిత్రానికి జోడిస్తాము. మీ అందరినీ శ్రీరాముడు ఆశీర్వదించాలి అని వ్యాఖ్యానించారు.