Begin typing your search above and press return to search.

ఆదిపురుష్.. మొత్తం ఎన్ని సాంగ్స్ అంటే?

By:  Tupaki Desk   |   10 Oct 2022 3:49 AM GMT
ఆదిపురుష్.. మొత్తం ఎన్ని సాంగ్స్ అంటే?
X
రామాయణం కథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరావత్ తెరపైకి తీసుకు వస్తున్న 3D యానిమేషన్ మూవీ ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ మాత్రం ఊహించిన విధంగా నెగిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు మళ్ళీ పాజిటివ్ టాక్ అందుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.

తప్పకుండా మరొక టీజర్ తో ఆకట్టుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ విషయంలో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మొత్తానికి ఒక సాంగ్ విషయంలో అయితే క్లారిటీ వచ్చేసింది. సినిమా టీజర్ లో జైశ్రీరామ్ అనే పాట సినిమాలో భాగం కానుంది. ఆ పాట మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతుందట.

ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్యూన్స్ అన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఇక ఈ సినిమాలో మొత్తంగా మూడు పాటలు ఉంటాయని తెలుస్తోంది. మరొక పాట కూడా ఉంటుందని అంటున్నారు కానీ సినిమాలో కనిపించదట. 4వ పాట మాత్రం ప్రమోషన్ లో భాగంగా టైటిల్ కార్డ్స్ లో వస్తుందని ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో జై శ్రీరామ్ పాటతో పాటు సీతారాముల కలయికలో వచ్చే ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ కూడా అద్భుతంగా ఉంటుందట. ఇక తర్వాత రావణాసురుడికి సంబంధించిన ఎంట్రీ సాంగ్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక బ్యాక్ గ్రౌండ్ లో జైశ్రీరామ్ అనే పాటను యుద్ధ సన్నివేశాల్లో హైలెట్ అవుతుందని సమాచారం.

ఈ సినిమాను 3D యానిమేషన్ విజువల్స్ తో తెరపైకి తీసుకురాబోతున్నారు ఇప్పటికే ఆ ఫార్మాట్లో టీజర్ చూసిన ఫ్యాన్స్ అయితే కొంత సంతృప్తి చెందుతున్నారు. తప్పకుండా ఈ సినిమా వెండితెరపై సరికొత్త అనుభూతిని అందిస్తుందని కూడా నమ్మకంతో తెలియజేస్తున్నారు. ఇక మరింత ఆకట్టుకోవాలి అని ప్రస్తుతం ఆదిపురుష్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.