Begin typing your search above and press return to search.
మరో వివాదంలో 'ఆదిపురుష్'
By: Tupaki Desk | 7 Oct 2022 5:30 AM GMTరామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన తాజా పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ మూవీ గురించే వార్తలు కనిపిస్తున్నాయి. అది కూడా ట్రోలింగ్ మరియు వివాదాలతో ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం.
'ఆదిపురుష్' సినిమా షూటింగ్ 100 రోజుల్లోనే పూర్తయింది. అయితే మోషన్ క్యాప్చర్ మూవీ కావడంతో.. ఏడాది కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రచార చిత్రాలను వదలని మేకర్స్.. దసరా కానుకగా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను లాంచ్ చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే ఈ వీడియోకి మిశ్రమ స్పందన వచ్చింది.
'ఆదిపురుష్' టీజర్ లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ నాసిరకంగా ఉన్నాయని.. గ్రాఫిక్స్ చూస్తుంటే ఒక కార్టూన్ సినిమా చూస్తున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ మధ్య ఈ స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్న టీజర్ లేదని చెప్పాలి. అయితే ఈ సినిమా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించడంతో అది వివాదంగా మారింది.
రాముడ్ని హనుమంతుడిని అవమానించేలా చిత్రీకరించారని.. రావణుడి పాత్రని కూడా అభ్యంతరకరంగా డిజైన్ చేసారని ఆరోపించారు. రామాయణాన్ని ఏమాత్రం పరిశోధన చేయకుండా 'ఆది పురుష్' సినిమా చేసారని మండిపడ్డారు. ప్రస్తుతం ఇదే టాపిక్ మీద చర్చలు జరుగుతుండగా.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ప్రభాస్ సినిమా మరో వివాదంలో చిక్కుకొంది.
'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను తమ పోస్టర్ నుంచి కాపీ కొట్టారని వానర్ సేన స్టూడియోస్ అనే యానిమేషన్ స్టూడియో ఆరోపణలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాము డిజైన్ చేసిన శివ పోస్టర్ ను కాపీ కొట్టి ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ను రూపొందించారని.. తమ ఆర్ట్ వర్క్ కు టీ-సిరీస్ క్రెడిట్ ఇవ్వకపోవడం బాధాకరమని వానర్ స్టూడియోస్ పేర్కొంది.
ఆది పురుష్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ రాముడి అవతారంలో విల్లు ఎక్కుపెట్టడానికి రెడీ అవుతున్నట్లు కనిపించారు. యానిమేషన్ స్టూడియోస్ కు చెందిన శివ పోస్టర్ కూడా అచ్చు గుద్దినట్లు అలానే ఉంది. ఈ నేపథ్యంలో వానర్ సేన స్టూడియోస్ వారు తమ ఆర్ట్ వర్క్ ను ప్రభాస్ ఫస్ట్ లుక్ తో పోల్చుతూ.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. దీనికి మేకర్స్ ని ట్యాగ్ కూడా చేశారు.
"మేము రూపొందించిన శివ పోస్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ ను డిజైన్ చేశారు. టీ-సిరీస్ వారు ఒరిజినల్ క్రియేటర్ కు గుర్తింపు ఇవ్వకపోవడం బాధకరం" అని వానర్ సేన స్టూడియోస్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది. మరి దీనిపై మేకర్స్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
కాగా, 'ఆదిపురుష్' సినిమాలో రాఘవగా ప్రభాస్ కనిపిస్తే.. జానకిగా కృతి సనన్.. లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ మరియు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. IMAX మరియు 3D ఫార్మాట్లలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.