Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై 'ఆది పురుష్' ఎఫెక్ట్?
By: Tupaki Desk | 9 Nov 2022 7:30 AM GMT'సాహో' ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడం..ఆ తరువాత విడుదలైన 'రాధ్యేశ్యామ్' కూడా దానికి మించి డిజాస్టర్ అనిపించుకోవడంతో ప్రభాస్ అభిమానులు తమ ఆశలన్నీ 'ఆదిపురుష్' పైనే పెట్టుకున్నారు. టీజర్ రిలీజ్ తో 'ఆదిపురుష్' టీమ్ ప్రభాస్ అభిమానుల్ని ఆశన్నీ ఆవిరయ్యేలా చేశారు. ఏ విషయంలోనూ ఆది పురుష్ వీఎఫ్ ఎక్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం.. పక్కా యానిమేషన్ లా వుండటంతో అభిమానులు పెదవి విరిచిన విషయం తెలిసిందే.
శ్రీరాముడిగా ప్రభాస్ మేకోవర్, హను మంతుడి పాత్ర.. లక్ష్మణుడు.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ ని చూపించిన తీరు. ఇలా ప్రతీ పాత్రని పురాణాలకు పూర్తి భిన్నంగా చూపించిన తీరు ప్రేక్షకులని తీవ్ర అసహనానికి గురిచేసింది.
దీంతో దర్శకుడితో పాటు మేకర్స్ పై దారుణంగా ట్రోల్స్ కు దిగారు. రామాయణాన్ని పూర్తిగా మార్చేసి చూపించిన తీరు విమర్శలకు దారి తీసింది. టీజర్ పై వచ్చిన విమర్శల్ని, అభిమానుల కామెంట్ లని దృష్టిలో పెట్టుకున్న 'ఆదిపురుష్' టీమ్ వీఎఫ్ ఎక్స్ వర్క్ విషయంలో పునరాలోచనలో పడింది.
మరింత పర్ ఫెక్ట్ గా వీఎఫ్ ఎక్స్ ని పూర్తి చేయాలని భావించి సినిమాని 2023 సంక్రాంతికి విడుదల చేయడం లేదని, జూన్ 16న విడుదల చేస్తున్నామని ప్రకటించి షాకిచ్చింది. ఈ మూవీని వాయిదా వేయడం వల్ల 'సలార్'తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్'ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయాలని ఫిక్సయ్యాడు. డేట్ ని కూడా ప్రకటించిన ఇందుకు తగ్గట్టుగా షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నాడు కూడా.
అనుకున్న సమయానికి 'సలార్'ని పూర్తి చేసి వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడట. 'ఆది పురుష్' రిలీజ్ మారడంతో 'సలార్'తో పాటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. 'సలార్' రిలీజ్ ని మరో సారి మార్చే అవకాశాలు వున్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఆలస్యంగా పట్టాలెక్కనుందని చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల మూవీ తరువాత ప్రశాంత్ నీల్ భారీ పాన్ ఇండియా మూవీని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పడు ఆ ప్లాన్ 'ఆదిపురుష్' రిలీజ్ డేట్ మార్పుతో పూర్తిగా మారినట్టుగా తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తాడో.. 'సలార్'ని అనుకున్న సమయానికి పూర్తి చేసి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.