Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: పది తలల రావణాసురుడితో తలపడే అవతార్?
By: Tupaki Desk | 6 Dec 2020 1:18 PM GMTఓం రౌత్.. బాలీవుడ్‌లో `తన్హాజీ 3డి` చిత్రంతో సంచలనం సృష్టించారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో గ్రాండీయర్ లుక్ తో అత్యున్నత మేకింగ్ వ్యాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే ఉత్సాహంతో `ఆదిపురుష్` చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 3డీ ఫార్మాట్ లో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని టీ సిరీస్ సంస్థ ప్లాన్ చేస్తోంది.
ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ప్రభాస్ నీలిమేఘ శ్యాముడిగా నీలం రంగులో కనిపిస్తారు. అవతార్ తరహాలో బ్లూ కలర్ లో మరిపించేలా కనిపిస్తారని ఇన్ సైడ్ టాక్. పది తలల రావణాసురుడిగా సైఫ్ పాత్రని సరికొత్తగా డిజైన్ చేశారట. రాక్షస రాజు పాత్రని 3డీలో సరికొత్తగా డిజైన్ చేస్తున్నారట. ఈ మూవీ కోసం `అవతార్` టెక్నీషియన్స్‌ని తీసుకుంటున్నారట. బ్లూ మాట్‌లో హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అధునిక రామయాణ గాధని ఫిక్షనల్ పాత్రలతో తెరపైకి తీసుకురానున్నారన్నది హీట్ పెంచుతోంది.
ఇందులో మరో విశేషం త్రీడీలో పది తలల రావణాసురుడిని చూపించడం ట్రెండ్ సెట్టర్ గా నిలనుందని ఈ మూవీ మేకింగ్ టేకింగ్ అవతార్ ని మరిపించినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ మూవీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ విజువల్ ట్రీట్ గా సంచలనం సృష్టించనుందని బాలీవుడ్ అంతా చర్చజరుగుతోంది. జేమ్స్ కామెరున్ `అవతార్ `ని తీసినట్టు రామాయణ గాధలోని పాత్రల్ని తీసుకుని ఫిక్షనల్ గా ఓమ్ రౌత్ కొత్త పంథాలో తెరకెక్కించి భారతీయ తెరపై మిరాకిల్ చేయబోతున్నారట.
అలాగే `తన్హాజీ`ని 3డీలో తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించిన ఓమ్ రౌత్ `ఆదిపురుష్`ని తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నారట. ఇందులో కీలక విషయం ఏంటంటే రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ పాత్రని `300` మూవీ వారియర్ సీక్వెన్సుల్లో ఇమ్మోర్టల్స్ తరహాలో రాక్షసుడిగా డిజైన్ చేసి వుంటాడని ఇంతకుముందు రివీల్ చేసిన పోస్టర్ వెల్లడిస్తోంది.