Begin typing your search above and press return to search.
హాలీవుడ్ కి 'ఆదిపురుష్'..ఇక పాన్ వరల్డ్!
By: Tupaki Desk | 28 Jan 2022 4:31 AM GMTపాన్ ఇండియాస్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. `బాహుబలి` సక్సెస్ తో డార్లింగ్ ఇమేజ్ ఖండాలు దాటిపోయింది. ఒక్క సక్సెస్ ప్రభాస్ ని వివిధ భాషలకు రీచ్ అయ్యేలా చేసింది. ఇప్పుడాయన క్రేజ్ పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ రీచ్ అవ్వడానికి అతి సమీపంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా బాలీవుడ్ లో `ఆది పురుష్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరిలో వివిధ భాషల్లో రిలీజ్ అవుతోంది. హిందీ..తెలుగు..కన్నడ..మలయాళం..తమిళంతో పాటు ఇతర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రాన్ని హాలీవుడ్ లో ఇంగ్లిష్ వెర్షన్ లోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రఖ్యాత డీస్నీ స్టూడియోస్ తో రిలీజ్ కి సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాళ్లతో డీల్ ఒకే అయితే గనుక ఇంగ్లీష్ లో వివిధ దేశాల్లో చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోందిట. వరల్డ్ వైడ్ రిలీజ్ లో భాగంగా భారతీయ భాషలతో పాటు..మరో పది అంతర్జాతీయ భాషల్లోనూ కలిపి 20,000 వేల థియేటర్లలో ఇప్పటికే రిలీజ్ ఖరారైంది. హాలీవుడ్ రిలీజ్ కూడా కన్ఫమ్ అయితే థియేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక బిజినెస్ పరంగా 2000 కోట్ల బిజినెస్ జరిగినట్లు ప్రచారంలో ఉంది. హాలీవుడ్ లో కూడా రిలీజ్ అయితే ఆ సంఖ్య పెరగనుంది. మొత్తానికి `ఆదిపురుష్` విజువల్ ట్రీట్ ని భారీ ఎత్తునే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. `బాహుబలి` సక్సెస్ తో ప్రభాస్ క్రేజ్ జపాన్..తైవాన్..చైనా..మలేషియా..ఇండోనేషియా లాంటి దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఆ నమ్మకంతోనే `ఆదిపురుష్` ని పాన్ వరల్డ్ చేర్చాలని ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. `ఆదిపురుష్` ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం కాబట్టి పాన్ వరల్డ్ కంటెంట్ గానే చెప్పొచ్చు. ఇక ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు కూడా అన్ని పాన్ ఇండియా కేటగిరివే. `సలార్`..`ప్రాజెక్ట్-కె`.. సందీప్ వంగ సినిమా అన్నీ పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేవే కావడం విశేషం.