Begin typing your search above and press return to search.
#ఆదిపురుష్.. ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి
By: Tupaki Desk | 21 April 2021 7:55 AM GMTడార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ 3డిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. సైఫ్ ఖాన్ లంకేయునిగా కనిపించనున్నారు. సీతాదేవిగా కృతి సనోన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.
అయితే నేటి శ్రీరామనవమిని పురస్కరించుకుని 7.11 గంటలకు ఆదిపురుష్ నుంచి ప్రభాస్ కొత్త లుక్ రిలీజవుతుందని ప్రభాస్ అభిమానులు ఆశించారు. నిన్నంతా ఆదిపురుష్ బృందం సోషల్ మీడియాలో రకరకాల ముచ్చట్లతో వైరల్ అయ్యింది. ఉదయం 7:11 గంటలకు ఈ సినిమా నుంచి కొత్త అప్ డేట్ బయటికి వస్తుందని పుకారు షికార్ చేసింది. చిత్రబృందం #Adipurush India wide అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేశారు. కానీ ఇంతలోనే నిరాశ.
ఎంతో ఆసక్తిగా వేచి చూసిన ఆ సర్ ప్రైజ్ కానక రాలేదు. ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో డార్లింగ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉదయం ఏడు గంటలకే అప్ డేట్ వచ్చేస్తుందని ఆశగా ఎదురు చూసిన అభిమానులు ఇది ఊహించనే లేదు. తమ నిరాశను సోషల్ మీడియా వేదికలపై వ్యక్తం చేస్తున్నారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఒక గొప్ప కథ అసాధారణమైన పాత్రలతో సూపర్ హీరో తరహాలో మెస్మరైజ్ చేసే చిత్రమిదని చెబుతున్నారు. విజువల్ గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత ఉన్న చిత్రంగానూ ప్రమోటవుతోంది. శ్రీరామనవమి రోజు ప్రభాస్ అభిమానులు నిరాశపడ్డారు కాబట్టి దానికి ఓంరౌత్ ఏం సమాధానం చెబుతారో?