Begin typing your search above and press return to search.
సంక్రాంతి పందెంలో 'ఆదిపురుష్ 3డి'
By: Tupaki Desk | 1 March 2022 2:38 AM GMTసంక్రాంతి సీజన్ అనగానే సినిమాలకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. రిలీజ్ డేట్ లు ఫిక్స్ చేసేందుకు నిర్మాతలు చాలా అడ్వాన్స్ డ్ గా థింక్ చేస్తారు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న క్రేజీ 3డి మూవీ ఆదిపురుష్ 2023 సంక్రాంతి బరిలో దిగుతోందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్- సైఫ్ అలీ ఖాన్ - కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `ఆదిపురుష్ 3డి` చిత్రం 2023 సంక్రాంతి వారాంతంలో విడుదల కానుంది
తాజాగా టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ - దర్శకుడు ఓం రౌత్ బృందం మొత్తం మార్చి 1న ఉదయం 7.11 గంటలకు పెద్ద ప్రకటన చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఎప్పటి నుంచో ఆ ప్రకటన ఏమై ఉంటుందనే చర్చ సాగింది. ఎట్టకేలకు 2023 సంక్రాంతి వారాంతంలో ఆదిపురుష్ పెద్ద తెరపైకి వస్తోందని టీమ్ ప్రకటించింది.
నిర్మాత భూషణ్ కుమార్ అతని బృందం ప్రభాస్ -ఓం రౌత్‌లతో కలిసి దసరా- దీపావళి- క్రిస్మస్ - సంక్రాంతి అంటూ చాలా విడుదల తేదీల ఎంపికలను చర్చించారు. చివరకు జనవరి 13 సరైన తేదీ అని నిర్ణయించారు. 2023 ప్రారంభోత్సవం ఆదిపురుష్ తోనేనా? అంటే అంతకుముందు ఇంకా పలు భారీ చిత్రాలు విడుదలయ్యేందుకు ఆస్కారం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణా రాష్ట్రాలలో సంక్రాంతి అన్నిరకాలుగా బాక్సాఫీస్ కి కలిసొచ్చే సీజన్. పొంగల్ సీజన్ తమిళనాడులో సినిమాకు పెద్ద సహాయం చేస్తుంది. URI .. తాన్హాజీ వంటి చిత్రాలు హిందీ బెల్ట్ లో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయంటే సంక్రాంతి వారంలో విడుదలవ్వడమే కారణం. సంక్రాంతి సీజన్ హిందీ మార్కెట్ లో కూడా ఫలవంతమైనదని ప్రూవైంది.
ఇప్పటివరకూ 2023 సంక్రాంతికి ఎలాంటి పెద్ద రిలీజ్ గురించి ప్రకటన వెలువడలేదు. హిందీ- తమిళం లేదా తెలుగులో అధికారికంగా ఏ ప్రధాన చిత్రం విడుదల కానందున పెద్ద పాన్ ఇండియా మూవీగా ప్రభాస్ ఆదిపురుష్ 3డి నిలవనుంది. ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విజువల్స్ చూసిన వారు ఓం రౌత్ మరియు అతని బృందం సృష్టించిన నాణ్యమైన అంశాలను చూసి ఆశ్చర్యపోయారని తెలిసింది. ఆదిపురుష్ లో ప్రభాస్ -సైఫ్ అలీఖాన్ ల అవతారాలు రొటీన్ ప్రపంచానికి దూరంగా ఉన్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి రెండూ లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్ కావడంతో విజువల్ బ్రిలియన్సీకి చాలా స్కోప్ ఎక్కువ. ఫైనల్ అవుట్ పుట్ ను మెరుగుపరిచేందుకు టీమ్ పగలు- రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తోంది” అని తెలుస్తోంది. రామాయణంపై ఇలాంటి ప్రయత్నం ప్రపంచ ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొస్తుందని అంచనా. మునుపెన్నడూ లేని విధంగా విజువల్ రైడ్ కానుంది ఈ చిత్రం.
నిజానికి ఆదిపురుష్ 11 ఆగస్టు 2022న రావాలనేది మొదటి టార్గెట్ అయితే విజువల్స్ విషయంలో ఎవరూ రాజీపడే మూడ్ లో లేనందున టీమ్ విడుదలను కొన్ని నెలలు ఆలస్యం చేయాలని నిర్ణయించుకుంది. ఇది VFX ఫిల్మ్ లో హాలీవుడ్ రేంజు మూవీని రూపొందించాలనే ఆలోచన తోనే అని కూడా తెలుస్తోంది. ఇంతకుముందు దసరా- దీపావళి విడుదల అనుకున్నారు. అయితే ఈ తేదీలను ఇప్పటికే వివిధ పరిశ్రమల నుండి పెద్ద సినిమాలు లాక్ చేసుకున్నాయి. ఇలాంటి అనేక కారణాల వల్ల ఆదిపురుష్ 2023 సంక్రాంతికి వెళ్లింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల ప్రమోషన్స్ కి సిద్ధమవుతున్నాడు. ఇది మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే సలార్- ప్రాజెక్ట్ కె లాంటి భారీ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. దిల్ రాజుతో సినిమా కూడా ఉంది. సెప్టెంబర్ నుండి అక్టోబర్ సీజన్ లో 2022లో సలార్ అతని రెండవ విడుదల అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ సలార్ విడుదల స్థితిపై ఖచ్చితమైన స్పష్టత రాలేదు.