Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' ని అటు నుంచి అలా నరుక్కుంటూ వస్తున్నారబ్బా!
By: Tupaki Desk | 1 Jun 2023 6:48 PM GMT'ఆదిపురుష్' రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు వారాల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూన్ 16న పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసారు.
ఇప్పటికే ప్రీ రిలీజ్ వేదిక ఖరారైంది. జున్ 6న గ్రాండ్ గా తిరుపతిలో ప్రీ రిలీజ్ పండుగ జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలుగు రిలీజ్ పరంగా ఎలాంటి ఢోకాలేదు. ఒక్క ఈవెంట్ తో డార్లింగ్ సినిమా జనాల్లోకి వెళ్లిపోతుంది.
ఇండియా వైడ్ టార్గెటెడ్ ఏరియాలు అంటూ కొన్ని ఉన్నాయి. నార్త్ సహా సౌత్ లో కొన్ని పట్టణాల్లో ప్రత్యేకంగా ప్రమోట్ చేయాల్సి ఉంది. రాముడి కథని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే! అందుకు సరైన సాధనాలు అంతే అవసరం.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ప్రచారం తెలివిగా నిర్వహిస్తున్నట్లు తాజా సన్నివేశాలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకుల్ని 'ఆదిపురుష్' టీమ్ వదిలి పెట్టడం లేదు. వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాను కలిసి ఆయన బ్లస్సింగ్స్ తీసుకున్నారు.
తాజాగా మేకర్స్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సమావేశమయ్యారు. చిత్ర నిర్మాత భూషణ్ కుమార్- నటుడు దేవదత్త నాగే ముఖ్యమంత్రిని కలిసి సినిమా ట్రైలర్‌ను- జై శ్రీరామ్ పాటను ఆయనకు చూపించారు. వీక్షణ అనంతరం ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేసారు.
ఆదిపురుష్ టీమ్కి ..నిర్మాతల కు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ప్రామిస్ చేసారు. ఈ నేపథ్యంలో టీమ్ తదుపరి ఏ రాష్ట్రానికి వెళ్లబోతుంది? ఏ నాయకుడిని కలవబోతున్నారు? అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఇలా వరుసగా చిత్ర బృందం రాజకీయ నాయకుల్ని కలవడంతో! సందేహాలకు తావిచ్చినట్లు అవుతుంది. పనిగట్టుకుని నాయకుల్ని కలవడం ఏంటి? అని ఓ సందేహం వ్యక్తం అవుతుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన కథలో వివాదాస్పద అంశాలు ఏవైనా ఉన్నాయా? రిలీజ్ కి ఆటంకాన్ని ఏర్పరిచే పరిస్థితులు ఏవైనా ఉన్నాయా? అని కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు..కేరళ..కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ప్రచారం చేస్తారా? అని ఓ డౌట్ రెయిజ్ అవుతుంది.