Begin typing your search above and press return to search.
ఇండియా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ టీజర్ కి అంతా సిద్ధం!
By: Tupaki Desk | 1 Oct 2022 12:34 PM GMTయావత్ ఇండియా మొత్తం ఓ టీజర్ కోసం అసక్తిగా ఎదురుచూస్తోంది. అదే `ఆది పురుష్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఇది. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాంలో రూపొందిన ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రకిలీజ్ చేయబోతున్నారు. కృతిసనన్ సీతగా, ప్రభాస్ రాముడిగా నటించారు. అంతే కాకుండా ప్రభాస్ కెరీర్ లో తొలిసారి నటిస్తున్న మైథలాజికల్ మూవీ ఇది. టి. సిరీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని 3డీ ఫార్మాట్ తో పాటు ఐమ్యాక్స్ వెర్షన్ లోనూ రిలీజ్ చేస్తున్నారు.
రామాయణ గాథ ఆధారంగా జపనీస్ మూవీ `రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా` స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయి నెలలు కావస్తోంది. అయితే సీజీ వర్క్ కి పెద్ద స్కోప్ వున్న మూవీ కావడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం తీసుకుంటోంది. అంతే కాకుండా భారతీయులంతా అమితంగా ఇష్టపడే రామాయణ ఇతిహాసం నేపథ్యంలో అధునిక సాంకేతికతో ఓ దృశ్యకావ్యంగా హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.
ఈ మూవీ కోసం యావత్ ఇండియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చాలా ఏళ్ల విరామం తరువాత రామాయణ గాథ ఆధారంగా వస్తున్న మరో సినిమా కావడం, ప్రభాస్ తొలి సారి శ్రీరాముడి పాత్రని ధరించడం, గతంలో వచ్చిన రామాయణ గాథలకు పూర్తి భిన్నంగా ఓ విజువల్ ట్రీట్ గా ఈ మూవీని ఓంరౌత్ తెరకెక్కిస్తున్నానని ముందు నుంచే చెబుతూ వుండటంతో ఈ మూవీ ఎలా వుండబోతోంది? ..ఇంతకీ ఈ మూవీని ఎలా తెరకెక్కించారు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
రీసెంట్ గా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయడంతో అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి జన్మ స్థలం అయోధ్యలో ఈ సినిమా టీజర్ ని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం టీజర్ లాంచ్ జరగనున్న నేపథ్యంలో మేకర్స్ అయోధ్యలో టీజర్ లాంచ్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి హల్ చల్ చేస్తున్నాయి.
సుందరమైన అయోధ్య హెరిటేజ్ కట్టడాల మధ్య భారీ సెట్ ని నిర్మించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ భారీ ఈవెంట్ లో ప్రభాస్ తో పాటు చిత్ర బృందం అంతా పాల్గొనబోతోంది. ఆదివారం రాత్రి 7:11 నిమిషాలకు టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. దీని కోసం యావత్ ఇండియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.