Begin typing your search above and press return to search.

#ఆదిపురుష్‌.. టెక్నిక‌ల్ VFX గ్లిమ్స్

By:  Tupaki Desk   |   2 Nov 2021 4:17 AM GMT
#ఆదిపురుష్‌.. టెక్నిక‌ల్ VFX గ్లిమ్స్
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్ -3డి` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా...సీత‌గా కృతి స‌న‌న్.. ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో స‌న్నిసింగ్ న‌టిస్తున్నారు. ఇక `రామాయాణం`లో అత్యంత కీల‌కమైన‌ రావ‌ణుడి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖ్ నటిస్తున్నారు. టీ సిరీస్-రెట్రోఫ‌లైస్ సంస్థ‌లు దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. `ఆదిపురుష్` దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత‌ భారీ కాన్సాస్ పై తెర‌కెక్కుతోంది. చాలా భాగం షూటింగ్ ఇండియాలోనే వివిధ ప్రాంతాల్లో జ‌రిగింది. ఎక్కువ‌గా ముంబై.. హైద‌రాబాద్ లోనే ప్ర‌త్యేకంగా సెట్లు వేసి తెర‌కెక్కించారు.

ఇప్ప‌టికే ఆదిపురుష్ 3డి చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం ముంబైలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యాల్ని కృతిస‌న‌న్ రివీల్ చేసింది. సినిమా గ్రాండియ‌ర్ గా ఉంటుంది. నిర్మాణంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఇలాంటి సినిమా షూటింగ్ లు చేయాలంటే భారీ ఎత్తున పెద్ద పెద్ద‌ సెట్లు నిర్మించి ప‌నిచేయాల్సి ఉంటుంది. అనుకున్న దానికంటే బ‌డ్జెట్ ఎక్కువ అవుతుంది. కానీ ఆదిపురుష్ ఆ విష‌యాన్ని బ్రేక్ చేసింది. చిన్న సెట్ల‌లో ఎందుకు తీయ‌లేము అనే భావ‌న‌ని ఆదిపురుష్ బ్రేక్ చేసింది. లోకేష‌న్ కి పెద్ద‌గా ప‌ట్టింపు లేదు. వాటిని ఎక్కువ భాగంగా వీఎఫ్ ఎక్స్ లోనే హైలైట్ చేసి చూపించొచ్చు అని ఆదిపురుష్ క‌చ్చితంగా నిరూపిస్తుంది.

వెనుక మంచి టెక్నిక‌ల్ టీమ్ ప‌నిచేస్తుంది. ఇందులో వీఎఫ్ ఎక్స్ కి చాలా ప్రాధాన్య‌త ఉంటుంద‌న్నారు. సినిమా సెట్లు కోసం..పాత్ర‌ల కోసం వేసిన పెయింటింగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అప్ప‌టి వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబించేలా చాలా అద్భుతంగా పెయింట్లు వేసి వాటిని సెట్ రూపంలో తీసుకొచ్చి స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఇది నిజంగా గొప్ప అనుభూతినిచ్చింది. నా జీవితం కాలం `ఆదిపురుష్` గుర్తిండిపోయే సినిమా. ప్ర‌భాస్ ఎలాంటి స‌న్నివేశంలోనైనా ఎంతో కూల్ గా న‌టించేవారు. నా త‌ప్పుల్ని సైతం ఆయ‌న స‌రిదిద్దేవారు. ఆయ‌న పాన్ ఇండియా స్టార్ అయినా ఎంతో డౌన్ టూ ఎర్త్ ప‌ర్స‌న్ అని పొగిడేసింది కృతి. #ఆదిపురుష్‌.. చిత్రీక‌ర‌ణ ప‌రంగా టెక్నిక‌ల్ గా RRR ని మించుతారా? లేదా? అన్న‌దానికి విజువ‌ల్ వీక్ష‌ణ‌తోనే చెప్ప‌గలం. ఆదిపురుష్ రిలీజ్ కి ఇంకా చాలా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ఇప్ప‌ట్లో గ్లిమ్స్ ని ఆశించ‌లేం. కాస్త ఆగితే కానీ ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ గురించి ఇంకా ఏదీ తెలీదు.