Begin typing your search above and press return to search.

నితిన్ - బేబ‌మ్మ‌ల మెలోడీ అదిరిందే!

By:  Tupaki Desk   |   23 July 2022 8:14 AM GMT
నితిన్ - బేబ‌మ్మ‌ల మెలోడీ అదిరిందే!
X
యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ పొలిటిక‌ల్ డ్రామా 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం'. బేబ‌మ్మ కృతిశెట్టి, కేథ‌రిన్‌ హీరోయిన్ లు గా న‌టించారు. శ్రేష్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిటిక్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ ఎటాక్ టీచ‌ర్ సినిమాపై మంచి బ‌జ్ ని క్రియేట్ చేసింది.

ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల్లో వున్న నితిన్ ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నాడు. డిఫ‌రెండ్ మేకోవ‌ర్ తో స‌రికొత్త లుక్ తో మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గ క‌లెక్ట‌ర్‌ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, అంజ‌లి, నితిన్ పై రూపొందించిన జాత‌ర సాంగ్.. ఈ సాంగ్ చివ‌ర్లో 'జ‌యం' మూవీలో పాపుల‌ర్ అయిన 'రాను రానంటూనే చిన్న‌దో..' అనే లిరిక్ ని యాడ్ చేయ‌డంతో ఈ పాట మ‌రింత‌గా నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఇదిలా వుంటే నితిన్ కెరీర్ లోనే హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఆగ‌స్టు 5న అత్యంత భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని జోరుగా స్టార్ట్ చేశారు.

ఇటీవ‌ల అంజ‌లి, నితిన్ ల‌పై జాత‌ర నేప‌థ్యంలో రూపొందించిన 'రారా రెడ్డి.. నేను రెడీ' అంటూ సాగే మాస్ మ‌సాలా లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. తాజాగా హీరో నితిన్‌, హీరోయిన్ కృతిశెట్టిల‌పై చిత్ర‌క‌రించిన మెలోడీ సాంగ్ 'అదిరిందే..' లిరిక‌ల్ ని విడుద‌ల చేశారు.

ఇది ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన థ‌ర్డ్ సాంగ్‌. మ‌హాతి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించ‌గా కృష్ణ‌కాంత్ సాహిత్యాన్ని అందించారు. సంజిత్ హెగ్డే ఆల‌పించారు. క్యాచీ ప‌దాల‌తో శ్రావ్య‌మైన మెలోడీగా ఈ పాట సాగుతోంది. ఈ పాట‌లో హీరో నితిన్‌, కృతిశెట్టి చాలా కూల్ గా క‌ల‌ర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో క‌నిపించి త‌మ‌దైన స్టైల్లో అదిరిందే అనిపించారు. ఇదిలా వుంటే 'మాచ‌ర్ల ధ‌మ్కీ' పేరుతో జూలై 26న మ‌రో వీడియోని వ‌ద‌ల‌బోతున్నారు.

ఇక ఫైన‌ల్ గా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కి కూడా ముహూర్తం పెట్టేశారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ని జూలై 29న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేశారు. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీలో రాజ‌ప్ప‌గా మెయిన్ విల‌న్ పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తుండ‌గా ఈ మూవీకి ప్ర‌సాద్ మూరెళ్ల ఛాయాగ్ర‌హ‌ణం, మహ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం, డైలాగ్స్ మామిడాల తిరుప‌తి, ఆర్ట్ సాహి సురేష్‌, ఎడిటింగ్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు.