Begin typing your search above and press return to search.
నటనకు 10 పర్సెంట్ టాలెంట్ చాలు: ఆదిత్య
By: Tupaki Desk | 16 Feb 2018 7:40 AM GMTఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో సంపత్ - ఆదిత్య మీనన్ లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా బాగా పాపులర్ అయ్యారు. చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో వీరిద్దరూ ఎన్నో కీలకమైన పాత్రలు చేశారు. తమిళ - మలయాళ భాషల్లో గుర్తింపు పొందిన ఆదిత్యకు తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. నెగెటివ్ షేడ్స్ తో పాటు ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించగల ఆదిత్య...దూకుడు - మిర్చి - ఈగ వంటి సినిమాలో విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా, ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్య అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాహుబలి సినిమాలో అవకాశం రానందుకు చాలా బాధపడ్డానని తెలిపారు.
ఈగ సమయంలో రాజమౌళి గారితో పరిచయం ఉందని - ఆయన గొప్ప దర్శకుడని ఆదిత్య అన్నారు. ఆ సినిమాలో మాదిరిగానే బాహుబలిలో కూడా తనకు అవకాశం వస్తుందని భావించానని కానీ - చాన్స్ రాకపోవడంతో నిజంగానే ఫీలయ్యానని చెప్పారు. తనకు నటించాలని ఉన్నంత మాత్రాన అన్ని సినిమాల్లో ఉండాలంటే కుదరదని తన మనసును సరిపెట్టుకున్నానని చెప్పారు. ఈ మధ్య కాలంలో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలకు డిమాండ్ పెరిగిపోతోందని చెప్పారు. అయితే, సినిమాల్లో నటించడానికి 10 పర్సెంట్ టాలెంట్ ఉంటే సరిపోతుందన్నారు. కానీ, అవకాశాలు రావాలంటే 90 పర్సెంట్ నెట్వర్కింగ్ ....కమ్యూనికేషన్ - రిలేషన్ షిప్స్ ఉండాలన్నారు. ఆ విషయంలో తాను కొంచెం వీక్ అనుకుంటున్నానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.