Begin typing your search above and press return to search.

ఆదిత్య వర్మ: దాదాపు అర్జున్ రెడ్డి కాపీ పేస్ట్!

By:  Tupaki Desk   |   23 Nov 2019 10:56 AM GMT
ఆదిత్య వర్మ: దాదాపు అర్జున్ రెడ్డి కాపీ పేస్ట్!
X
టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాను ఇప్పటికే హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తే తెలుగుకన్నా పెద్ద హిట్ అయింది. తాజాగా 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'ఆదిత్య వర్మ' విడుదలైంది. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు దర్శకుడు గిరీశయ్య.

మరి ఈ సినిమాకు స్పందన ఎలా ఉంది అంటే దాదాపుగా పాజిటివ్ గా ఉంది. సినిమాను ఒరిజినల్ కు అనుగుణంగానే రూపొందించారు. అయితే స్వల్ప మార్పులు ఉన్నాయి. ఒరిజినల్ లో హీరోయిన్ కు ఒక వ్యక్తిత్వం అంటూ ఉన్నట్టుగా కనిపించదు. పురుషాధిక్య భావనలు ఉన్న హీరో 'ఈ ప్రాపర్టీ నాది' అంటే 'అవును' అన్నట్టుగా నడుచుకుంటుంది. హిందీలో కూడా ఈ పాత్రలో మార్పుచేర్పులు చెయ్యలేదు. తమిళంలో మాత్రం హీరోయిన్ బలవంతంగా ప్రేమలో పడినట్లుగా కాకుండా తను కూడా అదిత్య వర్మను ఇష్టపడినట్టుగా చూపించారు. ఇక అర్జున్ రెడ్డి పాత్రలో కొన్ని విపరీత పోకడల ఇంటెన్సిటీ తగ్గించారు.

ఒరిజినల్ సినిమాను ఆరాధించేవారికి ఈ మార్పులు నచ్చకపోవచ్చు కానీ ఈ సినిమాను గతంలో చూడనివారికి మాత్రం ఆ మార్పులు నచ్చే అవకాశం ఉంది. ఇక హీరో ధృవ్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ.. షాహిద్ లను మ్యాచ్ చెయ్యలేకపోయాడు అనేది వాస్తవం. కానీ తన పరిధి మేరకు చక్కగా నటించాడు. పాత్రకు సరిపోలేదనే భావన మాత్రం కలిగించలేదని అంటున్నారు. నటుడిగా ధృవ్ కు మంచి ఫ్యూచర్ ఉందని మెచ్చుకుంటున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ ఫలితం సంగతి ఈ వారాంతం తర్వాత తెలిసే అవకాశం ఉంది.