Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: ఆదిత్య వర్మ ఇంటెన్సిటీ
By: Tupaki Desk | 16 Jun 2019 6:06 AM GMTచియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ తెరంగేట్రం ఆశించినంత సాఫీగా సాగడం లేదన్న సంగతి తెలిసిందే. ధృవ్ ని జాతీయ అవార్డ్ గ్రహీత బాలా దర్శకత్వంలో వెండితెరకు పరిచయం చేయాలని చియాన్ చాలానే ప్లాన్ వేశాడు. కానీ అది కాస్తా మిస్ ఫైరవ్వడం కోలీవుడ్ సహా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో చర్చకు వచ్చింది. బాలా తీసిన సినిమా చెత్తగా ఉందంటూ మొత్తం సినిమాని స్క్రాప్ లో వేసేయడంతో విక్రమ్ సహా ఈ4 ఎంటర్ టైన్ మెంట్స్ పై బాలా కోర్టుకు వెళ్లారు. అయితే ధృవ్ కెరీర్ మ్యాటర్ కాబట్టి తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాలు తెలిసిందే. తెలుగు అర్జున్ రెడ్డి కి అసిస్టెంట్ గా పని చేసిన గిరీషయ్య చేతిలో ఈ ప్రాజెక్టును పెట్టారు. ఆదిత్య వర్మ టైటిల్ తో సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ యంగ్ డైరెక్టర్ కి తొలి సినిమా కాబట్టి సందీప్ వంగ తరహాలో అంత బలమైన ముద్ర వేస్తాడా? అంటూ చర్చ సాగింది.
తాజాగా ఆదిత్య వర్మ టీజర్ రిలీజైంది. ధృవ్ ని గిరీషయ్య ఏ రేంజులో చూపించాడు? బాలా ని కాదనుకున్నారు కాబట్టి తాము ఊహించినట్టే డెబ్యూ డైరెక్టర్ బాలా కంటే బాగా చూపించగలిగాడా లేదా? అన్నది తెలియాలంటే ఈ టీజర్ చూడాల్సిందే. టీజర్ ఆద్యంతం అర్జున్ రెడ్డి ఫ్లేవర్ తేగలగడంలో శిష్యడు గిరీషయ్య సక్సెసైనట్టే కనిపిస్తోంది. గుబురు గడ్డం చెదిరిన జుట్టుతో ధృవ్ లో ఇంటెన్సిటీ లెవల్ ని బాగానే ఎలివేట్ చేశాడు. కాలేజ్ టాపర్ ఆదిత్య వర్మలో ఉన్న అన్ని క్వాలిటీస్ ని టీజర్ లో అద్భుతంగానే చూపించారు. ఇటు తెలుగు వెర్షన్.. అటు హిందీ వెర్షన్ (షాహిద్ కబీర్ సింగ్) కి ధీటుగా తమిళ టీజర్ ని ప్లాన్ చేశారని అర్థమవుతోంది. అయితే కేవలం కొన్ని సెకన్ల పాటు మెరిపించే టీజర్ మెప్పించినా అటుపై సినిమా మొత్తం మెప్పించేలా తీసాడా లేదా? అన్నది ఊహించడం కష్టమే. ఈ టీజర్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ బానిట సంధుతో ధృవ్ కెమిస్ట్రీ బాగానే వర్కవుటైనట్టే కనిపిస్తోంది. అమ్మడితో హగ్గులు.. ఘాటైన లిప్ లాకుల్లో ధృవ్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. టీజర్ వరకూ ఓకే. మరి ట్రైలర్ ఎప్పుడొస్తుందో చూడాలి.
ఈ టీజర్ కి రధన్ మ్యూజిక్ పెద్ద ప్లస్. ఎప్పటిలానే రధన్ రీరికార్డింగ్ ని అదరగొట్టాడు. ప్రియా ఆనంద్ ఈ చిత్రంలో మరో కీలక పాత్రధారి. ఇక ఈ4 ఎంటర్ టైన్ మెంట్స్ ఓసారి తీసిన సినిమాని స్క్రాప్ లో వేసింది కాబట్టి రెండోసారి జాగ్రత్త పడిందనే అనుకోవాలి. త్వరలోనే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ సాగుతోంది.