Begin typing your search above and press return to search.

ఈ కొత్త పిల్ల కూడా ఔటేగా!!

By:  Tupaki Desk   |   22 Oct 2016 4:08 AM GMT
ఈ కొత్త పిల్ల కూడా ఔటేగా!!
X
ఒకప్పుడు నార్త్ నుండి వచ్చినా కూడా సిమ్రాన్.. సొనాలి బింద్రే.. సాక్షి శివానంద్ వంటి భామలు తమ హావభావాలతో కుమ్మేశారు. అందుకే తెలుగువారు వాళ్లకు గుండెల్లో గుడులు గట్టేశారు. అయితే ఇప్పుడొస్తున్న చాలామంది నార్త్ భామలు మాత్రం.. కాజల్ అండ్ తాప్సీ టైపులో కూడా ప్రయత్నించట్లేదు. ఎంతసేపూ తూతూతూ మెమెమే అన్నట్లు పనికానిస్తున్నారు.

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పూరి జగన్ పరిచయం చేసిన అమ్మాయిలందరూ అలాగే ఉన్నారు. మొన్నామధ్యను మనోడు దిశా పటానీ అనే ఓ సెక్సీ మోడల్ ను ''లోఫర్'' సినిమాతో ఇంట్రొడ్యూస్ చేశాడు. అమ్మడు హాటు లుక్స్ లో చంపేసిందేమో కాని.. తరువాత మాత్రం వెండితెరమీద తేలిపోయింది. అందుకే లోఫర్ సినిమా చేశాక ఆమెకు అస్సలు ఆఫర్లే రాలేదు. ఇప్పుడు ఇక ''ఇజం'' సినిమాతో ఏకంగా గత సంవత్సరపు మిస్ ఇండియా అదితి ఆర్యను ఇంట్రొడ్యూస్ చేశాడు పూరి. మరి ఈ అమ్మాయ్ పరిస్థితి ఏంటి?

హీరోయిన్ కోసం తాను రాసుకున్న రోల్ బాగుంది కాని.. ఆ హీరోయిన్ మాత్రం సెట్టవ్వలేదు. తెలుగు అర్ధంకాక యాక్ట్ చేయలేకపోయిందో లేకపోతే ఏదో చేయిద్దాం అనుకుని పూరి అలా చేయించాడో తెలియదు కాని.. ఈ కొత్త పిల్ల కూడా దాదాపు డక్ ఔట్ అయినట్లే అంటున్నారు సినిమా లవర్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/