Begin typing your search above and press return to search.
దర్శకుడి వేధింపులతో సినీనటి ఆత్మహత్య
By: Tupaki Desk | 4 Oct 2016 4:52 AM GMTదక్షిణ భారతదేశ సినీపరిశ్రమలో సినీ హీరోయిన్లకు తీవ్రమైన వేధింపులు ఉంటాయనే విమర్శల్లో మరో కోణం తెరమీదకు వచ్చింది. చిత్రపరిశ్రమ ద్వారా సత్తా చాటుకునేందుకు ఎన్నో కలలతో వచ్చిన ఓ సినీ నటి దర్శకుడి చేతుల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురై ఏకంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఆ సినీ నటి పేరు అదితి అకా అతిర సంతోష్ కాగా..ఆ తమిళనాడు దర్శకుడి పేరు సెల్వకన్నన్.
కేరళకు చెందిన అదితి సిని అవకాశాల కోసం చెన్నై వచ్చింది. ఈ క్రమంలోనే పరిచయమైన సెల్వ కన్నన్ తను ఆమెను ప్రేమిస్తున్నట్లు వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురిచేశాడు. ఏకంగా ఓ ఇంట్లో బంధించాడు. దీంతో అదితి ఎలాగోలా తప్పింకొని కేరళకు తిరిగి వెళ్లిపోయింది. కొద్దికాలం తర్వాత ఓ యాడ్ కోసం చెన్నైకి తిరిగి వచ్చినపుడు సెల్వకన్నన్ మరోమారు కొందరితో కలిసి షూటింగ్లోనే ఇబ్బందిపెట్టాడు. దీంతో అదితి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటివరకు ఈ విషయమై సెల్వ కన్నన్ అధికారికంగా స్పందించలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/