Begin typing your search above and press return to search.

హైదరాబాదే కాని.. పాపకు తెలుగు రాదు

By:  Tupaki Desk   |   28 Feb 2018 5:30 PM GMT
హైదరాబాదే కాని.. పాపకు తెలుగు రాదు
X
సంజ‌య్ లీలా భ‌న్సాలీ తీసిన వివాదాస్ప‌ద చిత్రం ప‌ద్మావ‌త్. నిజానికి ఆ సినిమాలో గొడ‌వ‌లు రేపే స‌న్నివేశాలు ఏం లేక‌పోయినా కూడా వివాదాలు ఒక రేంజ్‌లో రేగాయి. ఆ సినిమాలో క్రూరుడైన ఖిల్జీ భార్య‌గా న‌టించింది అదితి రావ్ హైద‌రి. న‌వాబుల బిడ్డ అయిన ఈమె పుట్టింది పెరిగింది హైద‌రాబాదే కానీ... తెలుగు మాత్రం రాదంట‌.

మ‌ణిర‌త్నం చెలియా సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడ‌లేదు. అందులో చేసిన అదితికి - కార్తికి మాత్రం మంచి పేరే తెచ్చింది. తొలిసారి అదితి డైరెక్ట్ తెలుగు సినిమాలో న‌టించ‌బోతోంది. సుధీర్ బాబు స‌ర‌స‌న... ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తీసే సినిమాలో న‌టించ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో సంగ‌తులు మీడియాతో పంచుకుంది. అదితి ఎవ‌రో కాదు.. చాలా ఏళ్ల క్రితం హైద‌రాబాద్ కు ప్రధాన‌మంత్రిగా ఉన్న అక్బ‌ర్ హైద‌రి మ‌న‌వ‌రాలు. అలాగే వ‌న‌ప‌ర్తి సంస్థానాధీశులు రామేశ్వర్ రావు మ‌న‌వ‌రాలు కూడా. అమీర్ ఖాన్ భార్య కిర‌ణ్ రావ్ ఈమెకు అమ్మ త‌ర‌పు ద‌గ్గ‌రి బంధువు. అయినా స‌రే త‌న కుటుంబ గొప్ప‌త‌నాన్ని చెప్పుకోవ‌డానికి అదితి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌దు.

త‌ను పుట్టింది కూడా హైద‌రాబాద్‌లోనేన‌ట‌. స్కూలింగ్ అంతా ఇక్క‌డే సాగింది. త‌రువాత చ‌దువు కోసం ఢిల్లీకి వెళ్లిపోయింది. ప్ర‌తి ఏడాది త‌ర‌చూ హైద‌రాబాద్ వ‌స్తూనే ఉంటుంది అదితి. ఎందుకంటే ఆమె అత్త‌లు - పిన్నిలు - బాబాయిలు - మామ‌య్య‌లు... అంద‌రూ ఇక్క‌డే ఉంటున్నారు. ఆమెకు తెలుగు మాట్లాడ‌డం అస్స‌లు రాదు. కాక‌పోతే అర్థం చేసుకోగ‌ల‌న‌ని చెబుతోంది. తెలుగు గ‌డ్డ‌పై పుట్టి... ఇక్క‌డే చ‌దివి ఆ భాష రాద‌ని చెబుతోంది పాప‌. త్వ‌ర‌లో తెలుగు సినిమాలో కూడా న‌టించ‌బోతోంది. ఆ సినిమా షూటింగ్‌ ల‌లో తెలుగు నేర్చుకుంటే... అదితి ఎంచ‌క్కా తెలుగు ఇండ‌స్ట్రీలో పాగా వేసేయ‌చ్చు. ఎంతైనా హైద‌రాబాద్ పిల్ల క‌దా.