Begin typing your search above and press return to search.

అదితీ మ‌తి చెడే అందాల ట్రీట్

By:  Tupaki Desk   |   13 April 2019 4:39 PM GMT
అదితీ మ‌తి చెడే అందాల ట్రీట్
X
అదితీ రావ్ హైద‌రీ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. `ప‌ద్మావ‌త్` చిత్రంలో ఖిల్జీ మోహించిన అందాల రాకుమారి పాత్ర‌లో మైమ‌రిపించింది. అటుపై టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సుధీర్ బాబు `స‌మ్మోహ‌నం`లో రియ‌ల్ లైఫ్ రోల్ పోషించి స‌మ్మోహ‌నానికి గురి చేసింది. సినిమాలో న‌వ‌నాయిక‌గా తెలుగు కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెట్టింది. న‌టిగా త‌న‌లో ర‌క‌ర‌కాల కోణాల్ని ఆవిష్క‌రించుకునేందుకు త‌పిస్తున్న ఈ భామ‌కు వెత‌క‌బోయిన తీగ‌లా మ‌ణిరత్నం లాంటి స్టార్ డైరెక్ట‌ర్ పిలిచి మ‌రీ న‌వాబ్ (చెక్కా చివంత వానం) చిత్రంలో అవ‌కాశం ఇచ్చారు. ఆ సినిమాతో అతిదీలోని యాక్టింగ్ స్కిల్స్ మెరుగ‌య్యాయ‌న్న‌ ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఓవ‌రాల్ గా అదితీ ప్ర‌స్తుతం సౌత్ లో హాట్ ప్రాప‌ర్టీ. అగ్ర క‌థానాయ‌కుల చూపు అదితీ వైపు ఉందంటే అతిశ‌యోక్తి కాదు. మ‌హేష్‌, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ లాంటి స్టార్లు అదితీ న‌ట‌న‌కు మంత్ర ముగ్ధులై అవకాశాలిచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. సౌత్ లో త‌న‌కు నిరూపించుకునేంత పెద్ద ఆఫ‌ర్ వ‌స్తేనే న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తోంది. ఆ క్ర‌మంలోనే త‌న‌ని వ‌రించిన భారీ పారితోషికాల్ని అదితీ తృణ ప్రాయంగా వ‌దులుకుంద‌ని ప్ర‌చార‌మైంది. పెద్ద నిర్మాణ సంస్థ అయినా త‌న పాత్ర‌లో వైవిధ్యం లేనిదే అంగీక‌రించేందుకు అదితీ సిద్ధంగా లేద‌ట‌.

అయితే అలా వ‌దులుకున్నా.. త‌న‌ని తాను ఎలా లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు అదితీ తెలివైన ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. దీపం ఉండ‌గానే అన్న చందంగా.. ప్ర‌స్తుతం త‌న‌కు ఉన్న క్రేజును ఏమాత్రం త‌గ్గ‌నీకుండా సామాజిక మాధ్య‌మాల ద్వారా యూత్ కి చేరువైంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాగ్ర‌మ్, ట్విట్ట‌ర్ లో షేర్ చేస్తోంది. వీటికి యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా అదితీ రివీల్ చేసిన‌ ఫోటోషూట్ లో మ‌తి చెడే అందాల‌తో మైమ‌రిపించింది. నాభి సౌంద‌ర్యం.. ఎద అందాల్ని గ‌మ్మ‌త్తుగా ఎలివేట్ చేస్తూ అగ్గి రాజేసింది. ప్ర‌స్తుతం ఈ లుక్ యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.