Begin typing your search above and press return to search.

సమ్మోహనం బ్యూటీకి కత్తిలాంటి ఆఫర్స్

By:  Tupaki Desk   |   21 Jun 2018 11:00 AM IST
సమ్మోహనం బ్యూటీకి కత్తిలాంటి ఆఫర్స్
X
టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఉన్నట్టు కనిపిస్తున్నా కొంత మంది హాట్ బ్యూటీలు ఆ కొరతను కవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఉన్న స్టార్ హీరోయిన్స్ కాజల్ తమన్నా లకు ఆఫర్స్ రావడం అంటే ఇప్పుడు కొంచెం కష్టమే. మరో మార్గం లేకుంటే తప్ప వారికి ఛాన్సులు రావడం లేదు. పైగా రెమ్యునరేషన్ కూడా చాలా డిమాండ్ చేస్తుండడంతో కొత్తగా బి టౌన్ నుంచి వచ్చిన భామలను వెతుక్కుంటున్నారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ మధ్య అదితి రావ్ హైదరి పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ఆమె నటించిన సమ్మోహనం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సినిమా యూఎస్ లో కూడా మంచి టాక్ తో డాలర్లను రాబడుతోంది. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న టాక్ ఏంటంటే.. అదితి కి లక్కీ అఫర్ దొరికినట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఒక పాత్ర కోసం అదితిని ఫిక్స్ చేసినట్లు టాక్.

ఇప్పటికే ఆ సినిమాలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. రీసెంట్ గా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక మరో పాత్ర కోసం అదితి రావ్ ను ఒకే చేసారని తెలుస్తోంది. అలాగే మరికొంత మంది స్టార్ హీరోలు కూడా ఈ భామపై ఫోకస్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ సమ్మోహనం పిల్ల ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిల్ లో మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న మినీ మల్టీస్టారర్ లో నటిస్తోంది.