Begin typing your search above and press return to search.
కాలెత్తి రెచ్చగొడుతున్న హైదరి
By: Tupaki Desk | 31 March 2020 11:30 PM GMT'ఇంట గెలిచి రచ్చ గెలువు' అనే నానుడి మనకు ఎప్పట్నుంచో తెలిసిందే. కానీ ఈ హాట్ బ్యూటీ మాత్రం 'రచ్చ గెలిచి తర్వాత ఇంట గెలిచింది'. తెలుగు రాష్ట్రంలో పుట్టి తమ టాలెంట్ ను వేరే సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకొని తిరిగి టాలీవుడ్ కు వచ్చిన తారలు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్లలో అదితి రావు హైదరి కూడా ఒకరు. 2006లో ప్రజాపతి అనే మలయాళంలో సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతిధి.. ఢిల్లీ 6 తో బాలీవుడ్ కి వెళ్ళింది. యా శాలి జిందగీ - రాక్ స్టార్ - కూబ్ సూరత్ - వాజిర్ - భూమి - పద్మావత్ చిత్రాలతో తనను తాను నిరూపించుకుంది.
'సమ్మోహనం' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సమ్మోహనం మంచి విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'నవాబ్'లో ముఖ్య పాత్రను పోషించింది అదితి రావు హైదరి. వరస విజయాలతో దూసుకుపోతున్న అదితి రావు హైదరి లక్కీతారగా మారింది. ఉదయనిధి స్టాలిన్ తో మిస్కిన్ దర్శకత్వంలో సైకో సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో ఈమెకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోల కోసం యువత ఆరటంగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయ్యారాలు పోతూ ఒక చైర్ మీద కూర్చున్న ఫోజ్ అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నది. ఈ ఫొటోలో తన మత్తెక్కించే చూపులతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. హైదరి ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కుతున్న 'వి' సినిమాలో నటిస్తున్నది.