Begin typing your search above and press return to search.

సౌత్ లో అలాగే కనిపిస్తుందట

By:  Tupaki Desk   |   13 Dec 2017 11:30 PM GMT
సౌత్ లో అలాగే కనిపిస్తుందట
X
కొన్నిసార్లు అలా కలిసొస్తుందంతే... ఏం కోరుకున్నామో అది అలా జరిగిపోతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ భామ అదితిరావ్ హైదరీకి ఇలాగే కలిసొస్తోంది. అందాల ఆరబోతలో అన్ని హద్దులు చెరిపేసిన ఈ భామ సౌత్ సినిమాల్లో చాలా పద్ధతిగా ఉండే రోల్స్ మాత్రమే చేస్తానంటోంది. దానికి తగ్గట్టు ఈ భామను హీరోయిన్ గా ఎంపిక చేస్తున్న డైరెక్టర్లు అసలు ఎక్స్ పోజింగ్ చేయమనే అడగడం లేదు.

బాలీవుడ్ సినిమాలు చూసేవారందరికీ అదితిరావ్ హైదరి ఎంతటి గ్లామర్ యాక్ట్రెస్సో చెప్పాల్సిన పనిలేదు. బికినీ డ్రస్సుల్లో అమ్మడి హాట్ హాట్ ఫోజులతో ఓ రేంజిలో కిర్రెక్కించ్చింది. బాలీవుడ్ ఫొటో షూట్స్ లో అయితే ఎక్స్ పోజింగ్ హద్దులు దాటించేసి ఇరగదీసేసింది. ఓ రకంగా బికినీలతోనే ఫేమస్ అయిన ఈ సుందరాంగికి అనుకోకుండా మణిరత్నం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశమొచ్చింది. కార్తి హీరోగా నటించిన చెలియా సినిమాలో ఆర్మీలో పనిచేసే డాక్టర్ రోల్ చేసింది. అసలే మణిరత్నం సినిమా.. అందులోనూ హుందాగా ఉండే డాక్టర్ పాత్ర కావడంతో ఎక్స్ పోజింగ్ అనే మాటే రాలేదు.

ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. సుధీర్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కుటుంబ సమేతంగా చూసే హాస్య చిత్రాలు తీసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం చేయబోతున్నారు. ఇంద్రగంటి సినిమాల్లో హీరోయిన్లు ఎప్పుడూ పద్ధతిగానే కనిపిస్తారు. కాబట్టి ఇక్కడా ఎక్స్ పోజింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు.

అదితిరావ్ హైదరి నేటివ్ ప్లేస్ హైదరాబాద్. సౌత్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అందువల్లనే ఏమో సౌత్ లో గ్లామర్ రోల్స్ చేయనంటోంది. తాజగా బాలీవుడ్ లో భూమి సినిమాలో సంజయ్ దత్ కూతురిగా నటిస్తోంది. ఇది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రే.