Begin typing your search above and press return to search.
అదితి ఆడిషన్.. అది చేసుకోవాల్సి వచ్చిందట!
By: Tupaki Desk | 20 May 2019 5:35 AM GMTమణి రత్నం సినిమాల్లో నటించడంతో పాటుగా స్ట్రెయిట్ గా తెలుగులో 'సమ్మోహనం' లాంటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది అదితి రావు హైదరీ. రీసెంట్ ఒక టాక్ షోలో పాల్గొన్న అదితి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. మణి రత్నం 'బొంబాయి' సినిమా చూసిన తర్వాతే సినిమాల్లోకి రావాలనే ఆలోచనకు బీజం పడిందని తెలిపింది. ముఖ్యంగా ఆ సినిమాలో 'కన్నానులే' పాట తనను మాయ చేసిందని తెలిపింది.
ఆడిషన్స్ లో ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారా అని అడిగితే అలాంటివి దాదాపుగా లేవని చెప్పింది. కానీ 'ఏ సాలి జిందగీ' సినిమా ఆడిషన్ లో నాకు అసలు తెలియని వ్యక్తితో దాదాపుగా 'అది' చేసుకోవాల్సి వచ్చింది. నాకు అతనెవరో తెలియదు. అతనేమో భారీకాయుడు.. ఏం జరుగుతోందో నాకేమీ అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. పేరు చెప్పలేదు కానీ అదితితో నటించిన వ్యక్తి అరుణోదయ్ సింగ్. మరి నటన అన్న తర్వాత అవన్నీ తప్పవు కదా?
చిన్ననాటి విషయాలు పంచుకుంటూ 5 వ తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి ప్రేమలేఖ అందుకున్నానని తెలిపింది. ఆ రాసిన ప్రబుద్ధుడు ఎవరో రెండు పేజీల కవిత్వం రాశాడట. 9 ఏళ్ళ వయసులో ప్రేమలేఖ అందుకున విషయం తలుచుకుంటే ఇప్పుడు అదోలా అనిపిస్తుందని అదెలా వర్క్ ఔట్ అవుతుందనే ఆలోచన వస్తుందని తెలిపింది. 21 ఏళ్ళ వయసులో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నానని అయితే తమ బంధం ఎక్కువకాలం సాగకపోవడం తో విడిపోయామని తెలిపింది.