Begin typing your search above and press return to search.

కోరక తీర్చమన్నారు..భోరున ఏడ్చా

By:  Tupaki Desk   |   31 July 2018 6:11 AM GMT
కోరక తీర్చమన్నారు..భోరున ఏడ్చా
X
కాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ ను కుదిపేసిన ఈ వ్యవహారం మంటలు అప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. బాధితులు ఒక్కరొక్కరు ఎప్పుడో ఒక చోట తమకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ అదితిరావు హైదరీ స్పందించారు.. ఈ హైదరాబాదీ అమ్మాయి బాలీవుడ్ లో హీరోయిన్ గా ఫేమస్ అయ్యింది. ఇటీవలే తెలుగు తెరపై సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’లో నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.

అదితి మాట్లాడుతూ ‘అవకాశం కోసం వచ్చే తారలను పట్టి పీడిస్తున్న ఈ సమస్య ఇప్పటిది కాదు.. ఎన్నో ఏళ్లుగా ఉంది. నా కెరీర్ ఆరంభంలో ఇలాంటి సమస్య ఎదురైంది. కొందరి కోర్కెలు తీర్చలేక ఆఫర్లు వదులుకున్నాను. నాకు ఎదురైన అనుభవాలను తట్టుకోలేక భోరున ఏడ్చిన రోజులున్నాయి. అలాంటి వాటికి లొంగక ఆఫర్లు వదులుకోవడం వల్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’ అని భావోద్వేగంతో అన్నారు.

‘ఓ హిందీ సినిమాలో అవకాశం వచ్చింది. ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు కమిట్ మెంట్ అయితేనే చాన్స్ అన్నారు. నో చెప్పి ధైర్యంగా ఎదురించి మాట్లాడాను. ఆ తర్వాత ఎనిమిది నెలల పాటు నాకు అవకాశాలు రాలేదు. దాంతో నేనేమీ కుంగిపోలేదు. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. ఇది సంతోషాన్ని కలిగిచింది.’అని అదితిరావు చెప్పుకొచ్చారు.

కొందరు సినీ ప్రముఖులు శరీరాలను ప్రేమిస్తే.. మరికొందరు నమ్ముకున్న వృత్తులను ఆరాధిస్తారని.. వారి వల్ల మనకూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నేను బలంగా నమ్మానని అదితి పేర్కొన్నారు. అవకాశాలు కోల్పోతామనే కాస్టింగ్ కౌచ్ గురించి కొందరు బయటకు చెప్పరని.. కానీ వాటికి తలవంచకూడదని అదితి చెప్పారు.