Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అమావాస్య చంద్రిక!
By: Tupaki Desk | 14 Feb 2019 4:31 PM GMT2018లో సైలెంట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి డీసెంట్ గా హిట్ కొట్టింది అదితీరావ్ హైదరీ. `సమ్మోహనం` సినిమాతో కుర్రకారును మంత్ర ముగ్ధం చేసింది. ఈ హైదరాబాదీ అమ్మాయి హైదరాబాద్ ఇండస్ట్రీలో ఘనమైన ఆరంగేట్రమే చేసింది. అంతకుముందు హిందీ అనువాద చిత్రం `పద్మావత్` లో ఖిల్జీ మోహించిన అందాల రాణి గా మైమరిపించే నటనతో ఆకట్టుకుంది. అలాగే మణిరత్నం `నవాబ్`లో హాట్ పెర్ఫామెన్స్ తో యూత్ ని మైకంలో ముంచింది. వరుణ్ తేజ్- సంకల్ప్ ల అంతరిక్షం చిత్రంలో యువ సైంటిస్ట్ గానూ అదితీ ఆకట్టుకుంది. అయితే ఆ రెండు సినిమాలు ఊహించని రీతిలో ఫ్లాపులవ్వడంతో అదితీ స్పీడ్ కి బ్రేక్ పడింది. గత కొంతకాలంగా ఈ భామ డ్రగ్ ఫ్రీ ఇండియా అంటూ కొత్త పల్లవి అందుకుని యూత్ ని అలెర్ట్ చేస్తోంది. రకరకాల వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది.
ప్రస్తుతం చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన `సైకో` అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఈ సినిమాకి మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక టాలీవుడ్ సినిమాల పరంగా కొంత సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ప్రణాళికలు రచిస్తోందిట. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్, మెగాపవర్ స్టార్ చరణ్ వంటి వారి దృష్టిలోనూ పడిన ఈ బ్యూటీకి మునుముందు భారీ అవకాశాలు దక్కే ఛాన్సుందని చెబుతున్నారు.
అప్పటివరకూ యూత్ ని టీజ్ చేసేందుకు అప్పుడప్పుడు ఇదిగో ఇలా ఫోటోషూట్లతో లైమ్ లైట్ లో ఉంటోంది. అదితీ పూర్తిగా డార్క్ బ్యాక్ డ్రాప్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈసారి బ్లాక్ లో అమావాస్య చంద్రికనే తలపిస్తోంది. ఈ లుక్ లో డార్క్ కలర్ బాటమ్.. వైట్ టాప్ కాంబినేషన్ తో మతి చెడగొట్టింది అమ్మడు. డిజైనర్ కాన్సెప్టుతో ఫోటో షూట్ ప్రస్తుతం వేడెక్కిస్తోంది. క్రీగంటి చూపులతో గుచ్చి గుచ్చి చూస్తూ కుర్రాకరు గుండెల్లోకి సూటిగా దూసుకుపోతోంది అదితీ.