Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: పెళ్ళి కూతురి గెటప్..సమ్మోహనం
By: Tupaki Desk | 10 Aug 2019 1:35 AM GMTమలయాళం సినిమా 'ప్రజాపతి' (2006) తో ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అదితి రావు హైదరీ. మణిరత్నం సినిమా 'కాట్రు వెలియిడై' డబ్బింగ్ వెర్షన్ 'చెలియా' ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'సమ్మోహనం' తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత 'అంతరిక్షం'.. 'నవాబ్' సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో కూడా అదితి సినిమాలు చేస్తుంటుంది. మిగతా మోడరన్ భామల్లాగే ఈ భామ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్. అదితి ఇన్స్టా ఖాతాకు 4.3 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.
తాజాగా ఈ భామ కల్కి ఫ్యాషన్ వారి బ్రైడల్ వేర్ దుస్తులు ధరించి ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న క్రీమ్ కలర్ ఛోళీ.. అదే రంగులో ఉన లెహెంగా ధరించి.. ఆ డ్రెస్ కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ తో ఒక అందమైన పోజిస్తూ కూర్చుంది. గడ్డం కింద చెయ్యి పెట్టుకుని ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. వీటన్నిటికి తోడుగా కాస్త గ్లామర్ ను కూడా ఒలికించింది.
ఈ ఫోటోకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. "బ్యూటిఫుల్ ప్రిన్సెస్".. "పర్ఫెక్ట్ బ్రైడ్.. సూపర్ డ్రెస్".. "చూపు తిప్పుకోలేకుండా ఉన్నా" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక అదితి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో నాని సినిమా 'V' లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా తమిళంలో 'సైకో'.. 'నాన్ రుద్రన్'.. 'తుగ్లక్ దర్బార్' అనే మూడు సినిమాల్లో నటిస్తోంది.