Begin typing your search above and press return to search.
రవి వర్మకే అందని అందానివో!
By: Tupaki Desk | 1 Oct 2018 3:13 PM GMTవరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తూ హైదరాబాదీ సోయగం అదితీరావ్ హైదరీ వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. `పద్మావత్ 3డి` చిత్రంలో ఖిల్జీ మోహించి చెరబట్టిన రాకుమారిగా నటించి ఆకట్టుకున్న ఈ భామ ఆ వెంటనే టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఇక్కడ సుధీర్ బాబు సరసన `సమ్మోహనం` చిత్రంలో మైమరిపించే నటనతో ఆకట్టుకుంది. అసలు సినిమా వాళ్లు అంటే గిట్టని కుర్రాడిని లవ్ లోకి దించే సినిమా హీరోయిన్ గా ఆ చిత్రంలో నటించి మెప్పించింది.
లేటెస్టుగా మరోసారి `నవాబ్` చిత్రంలో మెరుపులు మెరిపించింది. ఈ సినిమాలో ఛమక్కున మెరిసే పాత్రలో ఆకట్టుకుంది. జర్నలిస్టుగా ఇంట్రడక్షన్ ఇచ్చి - క్రూరుడైన అరవింద స్వామి ఉంపుడు గత్తెగా దర్శనమిచ్చి శృంగార నాయికను తలపించింది. అదితీ అందచందాలు కుర్రకారుకు గిలిగింతలు పెట్టాయంటే అతిశయోక్తి కాదు.
సౌత్‌లో క్షణం తీరిక లేనంత బిజీ అవుతున్న వేళ .. ఇదిగో ఇలా లేటెస్టుగా `హలో` మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. సంథింగ్ స్పెషల్ గా ఎగ్జోటిక్ లొకేషన్లలో అధితీని అంతే అందంగా ఛాయాచిత్రాల్లో బంధించారు. సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెల్లో .. పచ్చని వాతావరణంలో అద్భుతమైన వేలాడే బ్రిడ్జిపైనా - కూలిపోయిన ఎండు చెట్టు పరిసరాల్లో అతిధీ ఇచ్చిన ఫోజులు ఈ ఫోటోషూట్ కే హైలైట్. అదితీ అందచందాల్ని పదింతలు పెంచింది ఈ స్పెషల్ ఫోటోషూట్. డార్క్ - థిక్ కలర్స్ డ్రెస్ కోడ్ అతిధీ లుక్ లో ప్రత్యేకతను పెంచింది. రవి వర్మకే అందని అందానివో.. అంటూ యూత్ ఒకటే ఇదైపోతోంది ఈ ఫోటో షూట్ వీక్షించాక.