Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు సినిమాకు ఆమె టాటా

By:  Tupaki Desk   |   19 Nov 2017 4:22 AM GMT
సుధీర్ బాబు సినిమాకు ఆమె టాటా
X
భలే మంచి రోజు’ తర్వాత సుధీర్ బాబు సోలో హీరోగా సినిమానే చేయలేదు. కొన్ని నెలల కిందటే రిలీజైన ‘శమంతకమణి’తో పాటు ఇప్పుడతను నటిస్తున్న ‘వీర భోగ వసంతరాయలు’ కూడా మల్టీస్టారర్లే. ఐతే ఇటీవలే తాను కమిటైన ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్టు తీయగా.. అందులో సోలో హీరోగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సీనియర్ నిర్మాత శివలెంక ప్రసాద్ నిర్మించే చిత్రమే అది.

ఈ సినిమాకు బాలీవుడ్ భామ అదితిరావు హైదరిని కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. సుధీర్ లాంటి చిన్న స్థాయి హీరో సినిమాకు అదితి ఒప్పుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇంద్రగంటి హీరోయిన్లకు మంచి క్యారెక్టర్లు ఇచ్చి చాలా బాగా చూపిస్తాడు కాబట్టి ఈ సినిమాలో అదితి ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి జనాల్లో కలిగింది. కానీ ఈ సినిమా నుంచి అదితి తప్పుకుందని ఇప్పుడు వార్తలొస్తున్నాయి.

ఈ సినిమా కోసం అదితి రూ.50 లక్షల పారితోషకం అడిగిందట. ఐతే పరిమిత బడ్జెట్లో సినిమా తీయడానికి ప్రణాళికలు వేసుకున్న దర్శక నిర్మాతలు అంత ఇచ్చుకోలేమని చెప్పారట. అదితి రెమ్యూనరేషన్ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేయడంతో ఆమెకు వీళ్లు పెట్టేశారట. ఇప్పుడు ఆమె స్థానంలో మరో కథానాయికను తీసుకునే ప్రయత్నంలో పడ్డాడు మోహనకృష్ణ. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉంది.