Begin typing your search above and press return to search.
నటిగా కనిపంచబోతోన్న హీరోయిన్
By: Tupaki Desk | 26 Dec 2017 11:30 PM GMTబాలీవుడ్ లో ఈ మధ్య చాలా మంది నటీమణులు తెలుగులో కొన్ని ప్రత్యేక పాత్రలను చేయడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడానికి టాలీవుడ్ ని బాగా వాడేసుకుంటున్నారు. బాలీవుడ్ లో హీరోయిన్ గా కాకుండా ఎక్కువగా సైడ్ హీరోయిన్స్ పాత్రలని చేసిన అదితి రావ్ హైదరి కూడా ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ లో మంచి అవకాశాలను అందుకోవాలని చూస్తోంది.
ఇప్పటికే అమ్మడు సుదీర్ బాబుతో ఒక మంచి ఛాన్స్ కొట్టేసింది. వినూత్న దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన కృష్ణ ఒక డిఫెరెంట్ లవ్ డ్రామా ను తెరకెక్కిస్తున్నాడు. అయితే అందులో అదితి ఒక సినిమా యాక్టర్ గా కనిపించబోతోందట. సినిమాలో తప్పకుండా ఆమె పాత్ర అందరికి నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక సుదీర్ బాబు ఒక చిత్రకారుడిగా కనిపించబోతున్నాడు.
సినిమాలో ఎమోషనల్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయట. సుదీర్ బాబు కెరీర్ లో ఒక మంచి హిట్ కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసిన షూటింగ్ మరో రెండు మూడు నెలల్లో ఫినిష్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.