Begin typing your search above and press return to search.

ఆవిడ క‌ష్టాలు ప‌గోడికైనా రాకూడ‌దు!

By:  Tupaki Desk   |   18 Dec 2018 1:30 AM GMT
ఆవిడ క‌ష్టాలు ప‌గోడికైనా రాకూడ‌దు!
X
ఏదో స్పేస్ నేప‌థ్య ం సినిమా లో ఛాన్స్ ఇచ్చారు క‌దా? క‌్రేజీ గా ఉంటుంద‌ని న‌టించేస్తానంటే కుదురుతుందా..? రోప్‌ లు క‌ట్టి గాల్లో వేలాడ‌దీస్తారు. మెడ క‌ద‌ల్చ‌కుండా అక్క‌డే వేలాడాలి. అటూ ఇటూ క‌దిలితే అంతే సంగ‌తి. పైగా గాల్లో ఈత కొట్టాలి. ఎగురుతున్న ఫీలింగ్‌ తో రోప్‌ ని వేలాడాలి. ఇదంతా మామూలు క‌ష్ట‌మా.. అలాంటిలాంటి క‌ష్టం కాదు. ఇదే మాట‌ను అదితీ రావ్ హైద‌రీ కాస్త అటూ ఇటూగా త‌న‌ దైన శైలి లో చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల పాటు గాల్లోనే వేలాడాన‌ని, మెడ ప‌ట్టేస్తే ఇంట్లో చెప్ప‌కుండా చికిత్స చేయించుకుని షూటింగ్‌ లో పాల్గొన్నాన‌ని చాలా క‌ష్టాల చిట్టా చెప్పింది. దేవుడ ప‌గ‌వాడికైనా ఇలాంటి క‌ష్టాలు రాకూడ‌ద‌నిపించింది వినేవాళ్ల‌కు.

ఇంకా అదితీ ఏం చెప్పిందంటే .. ఈ సినిమా కోసం చాలా ప్రిపేర‌య్యాను. బల్గేరియా- ఈస్ట్రన్‌ యూరప్ వంటి చోట్ల నిపుణుల‌తో కలిసి వర్క్‌ చేశాం. చాలా రోజుల పాటు రోప్స్‌లో అలాగే వేలాడుతూ ఉండటం. దారాల సహాయంతో వెనక్కి తిరిగి పల్టీ కొట్టడం, గాలిలో ఈదడం వంటి స్టంట్స్‌ నేర్చుకున్నాను... అని అతిదీ చెప్పింది. ఉద‌యం హైద‌రాబాద్‌ లో షూటింగ్ చేసి సాయంత్రానికి మ‌ణిర‌త్న ం షూట్ కోసం చెన్న‌య్ విమానం ఎక్కాల్సి వ‌చ్చేది. ఒకేసారి రెండు సినిమాల‌తో కుస్తీలు ప‌ట్టాను. ఇక్క‌డ అంత‌రిక్షం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా హార్డ్‌ వర్క్‌ చేశాను. దారాల పై వేలాడే సమయంలో రక్తప్రసరణ అగిపోయిన బాధవచ్చినప్పుడు స్టంట్‌ టీంలో షకీరా అనే అమ్మాయిని పిలిచేదాన్ని తను వచ్చి దారాలను కాస్త వదులు చేసేది. మళ్లీ నార్మల్‌ అయిన తర్వాత మళ్లీ నటించేదాన్ని. పాత్ర కోసం మే ఉపయోగించిన హెల్మెట్ ఎంతో బరువుగా ఉండేది. దాన్ని వేసుకుంటే మెడనొప్పి వచ్చేది. తొమ్మిదో రోజున హెల్మెట్‌ ధరించగానే, భరించలేని నొప్పితో విలవిలలాడాను. డాక్టర్స్‌10 రోజులు పూర్తిగా బెడ్‌ రెస్ట్ అన్నారు. ఇంట్లో చెప్ప‌కుండానే భ‌రించాను.. అని అదితీ చాలా సీక్రెట్స్ చెప్పింది.

ఈ సినిమాలో రోల్ కోసం ప్రత్యేకంగా వ్యోమ‌గాముల్ని కలవలేదు. అంతా ఊహించుకుని చేయ‌డ‌మే. అయితే నేను చదువుకునే రోజుల్లో రాకేశ్‌ శర్మ గారి పిల్లలు మా స్కూల్లోనే చదివేవారు. ఆయన వారి పిల్లల కోసం తరుచుగా మా స్కూలుకు వస్తుండేవారు. ఆ సమయంలో ఆయన తో మాట్లాడేదాన్ని. అదంతా నాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డింద‌ని అదితీ చెప్పింది. ఈ క‌ష్టం ఫ‌లించే రోజు 21 డిసెంబ‌ర్. ఆ రోజు అంద‌రికీ తెలిసొస్తుందేమో!