Begin typing your search above and press return to search.
హీరోయిన్ కు కొత్త నిర్వచనం చెప్పిందిగా!
By: Tupaki Desk | 19 Dec 2018 1:30 AM GMTసన్నజాజి మొగ్గలా ఉండటమే కాదు టాలీవుడ్ హీరోయిన్లలో కాస్త భిన్నమైన అందం అదితీరావ్ హైదరీ సొంతం. మనిషిలో దర్పం ఉట్టి పడటమే కాదు.. ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే తత్త్వం ఆమెలో కనిపిస్తుంటుంది. కొన్ని పాత్రల విషయంలో ఆమె తప్ప మరెవరినీ ఊహించలేని పరిస్థితి. నాజూకుతనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అదితీ మాట విన్నంతనే యూత్ గుండెల్లో గుబులు రేగుతూ ఉంటుంది.
తాజాగా ఆమె చేసిన అంతరిక్షం మూవీ ఈ వారం రిలీజ్ కానుంది. తాజా గా ఒక మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. హీరోయిన్ పదానికి తనదైన అర్థాన్ని చెప్పి అందరి దృష్టి పడేలా చేశారు. కేవలం అందమైన ముఖం ఉంటే కొద్ది రోజుల్లోనే బోర్ కొట్టేయటం ఖాయమని.. టాలెంట్‌కు ప్రాధాన్యమిచ్చి కొత్త కొత్త పాత్రలు చేస్తే చాలా ఏళ్లు ఇండస్ట్రీలో ఉండొచ్చన్న ఆమె.. మన యాటిట్యూడ్.. పనితనమే హీరోయిన్ ను చేస్తుందని చెప్పారు.
సమ్మోహనం తర్వాత మళ్లీ గ్లామర్ పాత్ర చేయలేదని అడుగుతారని.. తన దృష్టిలో అస్ట్రోనాట్ ని మించిన హీరోయిన్ ఉండరన్నారు. ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకున్నా.. దర్శకుడు మాత్రం వేరే వారితో డబ్బింగ్ చెప్పించారన్నారు. ఈ సినిమా సమయంలోనే తాను నవాబ్ మూవీ చేశానని.. ఉదయం.. సాయంత్రం రెండు సినిమాలతో చాలా కష్టమైందన్నారు. తన దృష్టి లో నటులు అన్న వాళ్లు చిన్నపిల్లలని.. కెమెరా ఆన్ అయితే చాలా ఆనందం వచ్చేస్తుందని.. వేరే ప్రపంచంలోకి వెళ్లిపోతామన్నారు. చిన్నపిల్లల్ని ప్లే గ్రౌండ్లోకి వదిలిపెట్టినట్లే.. వారెంత సేపు అక్కడున్నా అలసట రాదని.. తాము కూడా అంతేనని.. కెమేరా ముందు నుంచి బయటకు రాగానే అలిసిపోతామని చెప్పారు. తన మాటలతో సినిమా అంటే తనకెంత ఫ్యాషనో అదితీ చెప్పేసిందిగా!