Begin typing your search above and press return to search.

పిచ్చెక్కిస్తున్న న‌వాబ్ గాళ్‌

By:  Tupaki Desk   |   20 March 2019 4:44 AM GMT
పిచ్చెక్కిస్తున్న న‌వాబ్ గాళ్‌
X
ఓవైపు అవార్డులు రివార్డులు.. మ‌రోవైపు క్ష‌ణం తీరిక లేనంత‌గా కెరీర్ బిజీ. ఇన్నిటి న‌డుమ మోస్ట్ డిజైర‌బుల్ గాళ్ అంటూ బోయ్స్ నుంచి గుర్తింపు.. ఇదంతా ఎవ‌రి గురించో తెలుసా? `న‌వాబ్` ఫేం అదితీరావ్ హైద‌రీ గురించే. స‌మ్మోహ‌నం సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన అదితీ ప్ర‌స్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ గాళ్ గా వెలిగిపోతోంది. ప‌ద్మావ‌త్ చిత్రంలో ఖిల్జీ చెర‌ప‌ట్టిన రాకుమారిగా అద్భుతంగా అభిన‌యించిన అదితీ అటుపై వ‌రుస‌గా మ‌ణిర‌త్నం లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. న‌వాబ్ ఇప్ప‌టికే రిలీజైంది. ఆ చిత్రంలో రొమాంటిక్ గాళ్ గా న‌టించి మైమ‌రిపించింది. ఇప్ప‌టికిప్పుడు నాని స‌ర‌స‌న ఓ చిత్రానికి ఎంపికైంద‌ని వార్త‌లొచ్చాయి. మ‌హేష్‌ - చ‌ర‌ణ్ లాంటి స్టార్ల స‌ర‌స‌న ఛాన్సులు ద‌క్కించుకునే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. టాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాల‌కు క‌మిట‌వ్వ‌బోతోంద‌ట‌. అటు త‌మిళంలోనూ ప‌లు క్రేజీ సినిమాల్ని ఖాతాలో వేసుకుని దూసుకెళుతోంది.

అదితీ స్పీడ్ ని క్యాచ్ చేయడం ఇత‌ర భామ‌ల‌కు సాధ్య‌మా? అనేంత‌గా దూసుకుపోతోంది. మ‌రోవైపు అవార్డులు రివార్డులతో మోతెక్కిపోతోంది. ప్ర‌ఖ్యాత హైద‌రాబాద్ టైమ్స్ నిర్వ‌హించిన స‌ర్వేలో `మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2018` ఖ్యాతిని అదితీరావ్ ద‌క్కించుకుంది. ఈ స‌ర్వేలో నంబ‌ర్ 1 బ్యూటీగా రికార్డుల‌కెక్కింది. మ‌రోవైపు ప్ర‌ఖ్యాత హ‌లో మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపైనా అదితీ ద‌ర్శ‌న‌మీయ‌నుంది. హ‌లో మ్యాగ‌జైన్ త‌ర‌పున వెర్స‌టైల్ ఆర్టిస్ట్ 2019 అవార్డును ఈ అమ్మ‌డు గెలుచుకుంది. హాల్ ఆఫ్ ఫేం కేట‌గిరీలో అదితీని హ‌లో మ్యాగ‌జైన్ ఎంపిక చేసుకుంది. మొత్తానికి అదితీ బ్రేకుల్లేని ఎక్స్ ప్రెస్ లా ప‌రుగులు పెట్ట‌డం చూస్తుంటే త‌న‌ని ఇత‌ర భామ‌లు అందుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది.

న‌వాబ్ గాళ్ గులాం గిరీకి బోయ్స్ అంతా సాహో అనేస్తున్నారు. ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపిస్తూనే హీటెక్కించే అప్పీల్ అదితీ సొంతం. అందుకే ఈ అమ్మ‌డు అంత ఇదిగా దూసుకుపోతోంది. ఓవైపు మ‌ల్లూగాళ్స్ - ముంబై గాళ్స్ నుంచి పోటీ ఉన్నా హైద‌రాబాదీ గాళ్ గా.. టాప్ మోడ‌ల్ గా అదితీ పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డుతోంది. అదితీ అక్కినేని కాంపౌండ్ లోనూ న‌టించ‌నుంద‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.