Begin typing your search above and press return to search.
వెంకీ సినిమాను వదులుకుంది
By: Tupaki Desk | 28 Jan 2018 8:02 AM GMTపద్మావత్ లో అల్లాయుద్దిన్ ఖిల్జీ భార్య పాత్రలో మెప్పించిన ఆదితి రావు హైదరి మనకు మణిరత్నం చెలియా సినిమాతోనే పరిచయమైంది. కాని అది దారుణ ఫలితాన్ని అందుకోవడంతో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లోనే తన కెరీర్ ను సెటిల్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆదితి సౌత్ నుంచి ఏ ఆఫర్ వచ్చినా సాధ్యమైనంత మేరకు నో చెప్పకుండా ఉండడానికే ట్రై చేస్తోంది. అందులో భాగంగా దర్శకుడు తేజ-విక్టరీ వెంకటేష్ కాంబోలో రూపొందే కొత్త సినిమాకు సైన్ చేసింది. కాని రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడంలో జరుగుతున్న జాప్యం కారణంగా వాయిదా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే తేజ ఇందులో నటించబోయే కొత్త నటీనటుల కోసం మూడు రోజుల పాటు భారీ ఎత్తున ఆడిషన్ కూడా చేసారు.
ఒకపక్క ఎన్టీఆర్ సినిమా పనుల్లో బిజీ గా ఉంటూనే తేజ దీని మీద కూడా వర్క్ చేస్తున్నాడు. ఆలస్యానికి కారణం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ మీద నలుగురైదుగురు రచయితలు పని చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. తేజ దేని పట్ల పూర్తి సంతృప్తి చెందకపోవడంతో అనుకున్న రీతిలో వచ్చే దాకా షూటింగ్ కు వెళ్ళే సమస్యే లేదని తేల్చి చెప్పాడట. మరికొద్ది రోజుల్లో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. కాని కాల్ షీట్స్ అంతకు ముందే ఇచ్చేసిన ఆదితి రావు హైదరి ఇప్పుడు లేట్ అవుతూ ఉండటంతో తప్పుకుందని టాక్.
మణిరత్నం భారీ ఎత్తున నిర్మించబోతున్న మల్టీ స్టారర్ లో తను కూడా ఒక హీరొయిన్ గా నటిస్తోంది. అది కనక స్టార్ట్ అయితే బయటి సినిమాలకు చేసే అవకాశం ఉండదు. దానికి డేట్స్ ఇచ్చేసింది కాబట్టి వెంకీ సినిమాకు తప్పని పరిస్థితుల్లో బై చెప్పిందని తెలిసింది. ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ ని దీని కోసం పరిశీలిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాణమవుతున్న ఈ మూవీకి కొత్త హీరొయిన్ వేట మళ్ళి మొదలైంది.