Begin typing your search above and press return to search.

అడ్జస్ట్ కాలేదు.. అవకాశాలు పోయాయి!

By:  Tupaki Desk   |   23 Dec 2018 1:19 PM GMT
అడ్జస్ట్ కాలేదు.. అవకాశాలు పోయాయి!
X
#మీటూ ఉందంటారు కొందరు. ఉందన్నవారేమో ప్రూఫులు చూపరు. మేమేమైనా 24 గంటలూ కెమెరాలు పెట్టుకు తిరుగుతామా రికార్డ్ చేయడానికి అని తిరిగి ప్రశ్నిస్తారు. మరికొందరేమో #మీటూ లేదు.. మాకెప్పుడూ ఎదురు కాలేదు అంటారు. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో ఎవరికీ తెలీదు. ఈమధ్య తమన్నాను లైంగిక వేధింపుల గురించి అడిగితే తనకెప్పుడూ ఎదురు కాలేదని చెప్పింది. అదే ప్రశ్న అదితి రావు హైదరీని అడిగితే ఉందని తేల్చేసింది.

ఆఫర్స్ కోసం తనను అడ్జస్ట్ కావాలని అడిగారని చెప్పింది. వారు డిమాండ్ చేసినట్టు అడ్జస్ట్ కాకపోవడంతో కొన్ని నెలల పాటు అవకాశాలు దొరకలేదని తెలిపింది. 'అవకాశమా .. అయితే అడ్జస్ట్ మెంట్' అని డైరెక్ట్ గా అడిగారని చెప్పింది. కానీ అందుకు ఒప్పుకోకపోవడంతో అవకాశాల విషయంలో ఇబ్బంది పడ్డానని.. ఆసమయంలో తన మేనేజర్.. ఇండస్ట్రీ లో ఉన్న ఇతర స్నేహితులు తనకు అండగా నిలిచారని.. ధైర్యం చెప్పారని తెలిపింది.

తమన్నా చెప్పిన దానికి భిన్నంగా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల సమస్య ఉందని స్పష్టం చేసింది. కానీ అదితి ఈ విషయంలో అందరూ ఓపెన్ కావాలని.. తమకెదురైన ఇబ్బందులను వెల్లడించాలని మనం బలవంతం చేయలేమని చెప్పడం విశేషం. మరోవైపు తనను అడ్జస్ట్ మెంట్ కోసం అడిగినవారెవరనే విషయం కూడా బయటపెట్టలేదు.