Begin typing your search above and press return to search.
పవిత్ర బంధం.. సిద్దార్థ్ తో అఫైర్ పై హీరోయిన్ కామెంట్స్
By: Tupaki Desk | 13 March 2023 12:50 PM GMTహీరో సిద్దార్థ్ మరియు అదితి రావ్ హైదరీ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఇద్దరు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు ఇదే సాక్ష్యం అన్నట్టుగా చాలా ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గత కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారనే విషయం తెల్సిందే. హీరోయిన్ గా అన్ని భాషల్లో కూడా అదితి రావ్ హైదరీకి మంచి గుర్తింపు ఉంది.
ఈ సమయంలో ఆమె హీరోయిన్ గా కాస్త సినిమాలు తగ్గించడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో నటించక పోవడానికి కారణం సిద్దార్థ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల అదితి రావ్ హైదరీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సిద్దార్థ్ తో ఉన్న బంధం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. కొన్ని విషయాలను గురించి ఇతరులు మాట్లాడనక్కర్లేదు.. ఆ విషయాలను పవిత్రంగా భావించి వాటిని వదిలేయాలని పేర్కొంది.
సిద్దార్థ్ తో ఉన్న ప్రేమ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించలేదు. కానీ అది ఒక పవిత్రమైన విషయం అన్నట్లుగా పేర్కొంది. దాంతో సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందని మరింత బలంగా ప్రచారం జరుగుతోంది.
గతంలో సిద్దార్థ్ ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదితి రావ్ హైదరీ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈసారైనా తమ బంధం ను పెళ్లి బంధం గా సిద్దార్థ్ మల్చుకుంటాడా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.