Begin typing your search above and press return to search.

దర్శకుడు రెండు రిస్కులు చేశాడట

By:  Tupaki Desk   |   7 Dec 2016 10:30 PM GMT
దర్శకుడు రెండు రిస్కులు చేశాడట
X
దర్శకుడు ఆదిత్య చోప్రా సహజంగా స్టార్ హీరోల్లో కేవలం షారూక్ ఖాన్ తో మాత్రమే సినిమాలు చేస్తుంటాడు. మరే హీరోతోను సినిమాలు తీయకపోవడానికి కారణం.. తీయలేకపోవడమే అని చెబుతాడు ఈ దర్శకుడు. ఒక డైరెక్టర్ ని తనతో మాత్రమే పని చేసేలా షారూక్ మెప్పించేస్తాడని చెప్పాడు ఆదిత్య చోప్రా.

బేఫికర్ మూవీ విషయంలో మాత్రం తాను స్క్రిప్ట్ రాసుకుంటున్న దశలోనే ఈ స్క్రిప్ట్ లో హీరో రణవీర్ సింగ్ అని తేలిపోయిందని చెప్పాడు. కానీ షారూక్ ఖాన్ తో కాకుండా వేరే హీరోతో సినిమా చేయాలనే ఆలోచనే తనకు అప్పట్లో కొంత భయం వేసిందలా చెప్పిన ఆదిత్య చోప్రా.. తన భయాలన్నీ మొదటి రోజునే క్లియర్ అయిపోయినట్లు చెప్పాడు. తనకు షారూక్ ఖాన్ తర్వాత దొరికిన షారూక్ రణవీర్ సింగ్ అంటూ తేల్చేశాడీ డైరెక్టర్. అదే ఎనర్జీ.. అదే తెలివితేటలు.. అతే ఇంటలెక్చువాలిటీని రణవీర్ లో కూడా చూశానంటూ.. నెక్ట్స్ షారుక్ ఈజ్ రణవీర్ అనేశాడు ఆదిత్య చోప్రా. మొదట రిస్క్ అనుకుంటే అదే ఎనర్జీ అయిపోయిందట.

ఇక హీరోయిన్ గా వాణికపూర్ ను ఎంచుకోవడం కూడా రిస్క్ అంటున్నాడు ఈ దర్శకుడు. ఎవరినైనా కొత్త అమ్మాయిని ట్రై చేద్దామని అనుకున్నపుడు.. క్యాస్టింగ్ డైరెక్టర్ ఈమెను చూపించినా.. షైరా పాత్రకు వాణి న్యాయం చేయగలుగుతుందని అనుకోలేదట. 42 సార్లు బ్రేకప్ అయిపోయి.. అదే విషయాన్ని ధైర్యంగా పైకి చెప్పగలిగే పాత్ర కోసం ఆమెను ఎంచుకోవడం.. బేఫికర్ విషయంలో తాను చేసిన అతి పెద్ద రిస్క్ అని చెప్పాడు ఆదిత్య చోప్రా.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/