Begin typing your search above and press return to search.

షారుఖ్ తర్వాత మళ్లీ అతడే..

By:  Tupaki Desk   |   7 Oct 2015 9:26 AM GMT
షారుఖ్ తర్వాత మళ్లీ అతడే..
X
21 ఏళ్ల వయసుకే ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసే సినిమా తీసిన దర్శకుడు ఆదిత్య చోప్రా. యశ్ చోప్రా లెగసీని కంటిన్యూ చేస్తూ ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు ఆదిత్య. ఆ సినిమా అంత పెద్ద హిట్టయినా.. మళ్లీ ఆదిత్య మెగా ఫోన్ పట్టడానికి చాలా టైం పట్టింది. మిలీనియం మొదట్లో మొహబ్బతే తీసిన ఆదిత్య.. మళ్లీ 2010లో ‘రబ్ నే బనాదే జోడీ’ చేశాడు. మళ్లీ ఐదేళ్లు గ్యాప్ తీసుకున ఇన్నాళ్లకు మళ్లీ డైరెక్టర్ సీట్లో కూర్చుంటున్నాడు. ఈ మధ్యే తన కొత్త సినిమా ‘బేఫికర్’ గురించి ఆదిత్య తనదైన స్టయిల్లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఐతే ఆదిత్య చోప్రా దర్శకత్వంలో నటించబోయే ఆ అదృష్టవంతుడు ఎవరబ్బా అని అంతా ఆసక్తిగా చూశారు. ఆ బంపరాఫర్ రణవీర్ సింగ్ ను వరించింది. దీంతో బాలీవుడ్ అంతా అతణ్ని ఆకాశానికెత్తేస్తోంది. రణవీర్ కూడా గాల్లో తేలిపోతున్నాడు. ఆదిత్య ఇంతకుముందు చేసిన మూడు సినిమాలూ షారుఖ్ హీరోగా తీసినవే. అతను వేరే హీరోతో చేయడం ఇదే తొలిసారి. రణవీర్ ను హీరోగా పరిచయం చేసింది ఆదిత్యనే. అతడి నిర్మాణంలో తెరకెక్కిన ‘బ్యాండ్ బాజా బారత్’తోనే రణవీర్ హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రామ్ లీలా, గుండే, దిల్ దడ్కనే దో లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్ నటిస్తున్న‘బాజీరావు మస్తానీ’పై భారీ అంచనాలున్నాయి.