Begin typing your search above and press return to search.
సీన్ రివర్స్!... కంగనాపై హీరో కంప్లైంట్!
By: Tupaki Desk | 16 May 2019 4:49 AM GMTకంగనా రనౌత్... వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న బాలీవుడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటీమణి. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను నానా ఇబ్బందులకు గురి చేసిన కంగనా... ఇప్పుడు కొత్తగా మరో సీనియర్ హీరో ఆదిత్యా పంచోలిని టార్గెట్ చేసిన కంగనా... ఈ సారి మాత్రం అడ్డంగానే బుక్కైపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. తనకు జారీ చేసిన పరువు నష్టం దావాను వెనక్కు తీసుకోని పక్షంగా ఏకంగా రేప్ కేస్ పెట్టేస్తానని కంగనా బెదిరించిందట. అయితే చాలా తెలివిగా వ్యవహరించిన పంచోలి... కంగనా న్యాయవాది ఈ దిశగా ఫోన్ లో ఇచ్చిన వార్నింగ్ మొత్తాన్ని రికార్డ్ చేశారట. ఇప్పుడు దీనినే సాక్షంగా ఇస్తూ కంగనాపై పంచోలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి ఈ వ్యవహారం కంగనాను ఏ మేర ఇబ్బంది పెడుతుందో చూడాలి.
ఇక ఈ వ్యవహారం పూర్వపరాల్లోకి వస్తే.. పంచోలి ఇప్పుడైతే పెద్దగా కనిపించడం లేదు గానీ.. గతంలో ఆయన కూడా హీరోగా కొనసాగిన నటుడే. తాను హీరోగా నటించిన చిత్రాల్లో కంగనా కూడా కనిపించింది. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్ లో పంచోలి తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసిందట. దీనిపై భగ్గుమన్న పంచోలి... తాను అలాంటి చర్యలకు పాల్పడకున్నా... తనను వివాదంలోకి లాగుతోందని కంగనాకు ఏకంగా పరువు నష్టం దావా నోటీసులు జారీ చేశారట. దీంతో బెంబేలెత్తిన కంగనా తన లాయర్ ను రంగంలోకి దించిందట.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 6న కంగనా లాయర్... పంచోలికి ఫోన్ చేశారట. పరువు నష్టం దావాను వెనక్కి తీసుకోని పక్షంలో రేప్ కేసు పెడతామని ఆయన పంచోలిని బెదిరించారట. అంతేకాకుండా పర్సనల్ గా కలిసి కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడ్డారట. కంగనా లాయర్ నుంచి ఫోన్ రాగానే... అలర్ట్ అయిపోయిన పంచోలి... ఈ ఫోన్ సంభాషణ మొత్తాన్ని రికార్డు చేశారట. ఆ తర్వాత తనతో కంగనా లాయర్ భేటీని కూడా రికార్డ్ చేశారట. ఈ రెండు ఆధారాలతో వెర్సోరా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పంచోలి... కంగనాపై ఫిర్యాదు చేశారు. మరి ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి.